-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 24వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …
Read More »Tag Archives: machilipatnam
జిల్లాలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల నిర్వహణ… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు ఆదివారం నగరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి జిల్లాస్థాయి వేడుకలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను ఈ నెల 23వ తేదీన ఆదివారం రాష్ట్ర వేడుకగా అధికారికంగా నిర్వహిస్తుందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి జిల్లాస్థాయి కార్యక్రమమును ఆదివారం సాయంత్రం …
Read More »కలెక్టరేట్ సుందరీకరణలో భాగస్వామ్యం కావాలి..
-ఉద్యోగులతో కలిసి పలు ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేసిన జిల్లా కలెక్టర్ -కలెక్టరేట్లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ.. -సైకిల్ పై విధులకు హాజరైన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేసి కలెక్టరేట్ సుందరీకరణలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం ఆయన కలెక్టరేట్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించి పరిసరాల పరిశుభ్రత చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో …
Read More »స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేపు శనివారం నిర్వహించే శుభ్రత కార్యక్రమంలో అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. శనివారం ఉదయం ఏడు గంటలకే స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని, నగర పరిధిలోని ఉద్యోగులందరూ నడక లేదా సైకిల్ పై రావాలని, విజయవాడ వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు వాహనాలను షేర్ చేసుకుని రావాలని సూచించారు. ఏ శాఖల అధికారులు ఏ ఏ కార్యాలయాలను శుభ్రం …
Read More »కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందండి… : జిల్లా కలెక్టర్
భోగిరెడ్డిపల్లి (మచిలీపట్నం), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తమ పంటను విక్రయించి మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులను కోరారు. శుక్రవారం ఉదయం మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న గోనె సంచులు, రవాణా వాహనాలు, నమోదవుతున్న తేమశాతం …
Read More »ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి పలువురు ఉద్యోగుల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఉద్యోగుల సమస్యలను ఆలకించి పరిష్కారంపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. నిర్వహించిన గ్రీవెన్స్ లోని అర్జీలను సంబంధిత అధికారులకు పంపిస్తున్నామని చెబుతూ, వాటిని సకాలంలో పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కే …
Read More »రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు..
-కపిలేశ్వరపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కపిలేశ్వరపురం (పమిడిముక్కల), నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామంలో పర్యటించి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. అందుబాటులో ఉన్న గోనె సంచుల వివరాలపై సాంకేతిక సిబ్బందిని ఆరా తీసి సంచుల నాణ్యతను స్వయంగా …
Read More »మంత్రి నాదెండ్ల చొరవతో- రైతు సమస్య పరిష్కారం
-ధాన్యం కొనుగోలు సమస్యతో రైతు ఇక్కట్లు -సమాచారం అందిన వెంటనే మంత్రి ఎంట్రీ…. -కదిలిన యంత్రాంగం…ఒక్క రోజులో సమస్య పరిష్కారం -ఆశ్చర్యం, ఆనందంలో రైతాంగం కృష్ణాజిల్లా భట్లపెనుమర్రు గ్రామం/ మొవ్వ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు రైతు సమస్యల పరిష్కారంపై తనదైన ముద్ర వేశారు. మంత్రి తీసుకున్న చొరవకు యావత్ గ్రామం మొత్తం ఆశ్చర్యంలో తలమునకలైందంటే అతిశయోక్తి కాదు. కృష్ణాజిల్లా, మొవ్వమండలం, భట్లపెనుమర్రు గ్రామంలో ఒక చిన్న రైతు తాను పండించిన ధాన్యం అమ్ముకునే ప్రక్రియలో …
Read More »ఘనంగా జాతీయ సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సహకార వారోత్సవాలు ఈ రోజు ఘనంగా ముగిశాయి. నవంబర్ 14 నుంచి ప్రారంభమైన ఈ వారోత్సవాలు సహకార సమాఖ్యల ప్రాముఖ్యత, గ్రామీణ అభివృద్ధిలో సహకార రంగం పాత్రను ప్రజలకు చేరువ చేస్తూ విజయవంతంగా కొనసాగాయి. ముగింపు కార్యక్రమంలో చైర్మన్ నెట్టెం రఘురాం సహకార జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “సహకారం అనేది గ్రామీణ భారత ఆర్థిక నిర్మాణానికి వెన్నెముక. రైతులు, చిన్న వ్యాపారులు, మహిళా సంఘాలు, స్వయంసహాయక …
Read More »దివిసీమ ఉప్పెన మరచిపోలేని గాయం
-దివిసీమలో అశువులు బాసిన వారికి ఘన నివాళి అర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దివిసీమ ఉప్పెన రాష్ట్ర చరిత్రలో మరచిపోలేని ఒక గాయమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అవనిగడ్డలో మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో మంత్రి పాల్గొన్నారు. దివిసీమ ఉప్పెనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించారు. అంతరం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. అర్ధరాత్రి …
Read More »
Prajavartha Online Telugu News