మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు పలు రాయితీలు కల్పించడంలో భాగంగా దివ్యాంగ శక్తి పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార రాజా, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తిలతో కలసి పామర్రు లోని సచివాలయం-1 నుండి దివ్యాంగులతో ఉన్న గూడూరుకు ఒక బస్సు, కూచిపూడి కి మరో బస్సు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. పామర్రు నుండి గూడూరుకు …
Read More »Tag Archives: machilipatnam
పామర్రు నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ను కోరిన శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని కలిసి పామర్రు నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. నియోజకవర్గంలో చల్లపల్లి రహదారికి సమీపంలోని పామర్రులో టిడ్కో గృహాల నిర్మాణానికి ప్రతిపాదనను శాసనసభ్యుడు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అర్హులైన లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మొవ్వలో …
Read More »ప్రమాదాల నివారణకు తప్పనిసరిగా విద్యుత్ దీపాలు బాగా వెలగాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణకు తప్పనిసరిగా విద్యుత్ దీపాలు బాగా వెలగాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారి 65 మార్గంలో విద్యుత్ దీపాలు సరిగా వెలగడం లేదన్నారు. దీంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న …
Read More »సంక్షేమ వసతి గృహాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి…. : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు, సంక్షేమానికి సంబంధించిన సంయుక్త తనిఖీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పన పారిశుధ్యం, ఆరోగ్యం, తాగునీరు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, విద్యుత్ సౌకర్యాలు, భద్రతా సమస్యల …
Read More »ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం దివ్యాంగ శక్తి ప్రారంభ కార్యక్రమం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 18వ తేదీ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం దివ్యాంగ శక్తి ప్రారంభ కార్యక్రమం ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్ నుండి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభ కార్యక్రమం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల …
Read More »జిల్లాలో గృహ నిర్మాణం పనులు వేగవంతం చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గృహ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని మీకోసం సమావేశ మందిరంలో గృహ నిర్మాణం పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి మండలాలు, పురపాలికల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత 20 రోజులుగా గృహ నిర్మాణ పనులు పురోగతి పరిశీలిస్తే 844 గృహాలు దశల వారి మార్పు జరిగాయని, అందులో 306 గృహాలు పైకప్పు …
Read More »మంజూరైన మౌలిక వసతుల మరమ్మతు పనులు వెంటనే పూర్తి చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని 61 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో 10.35 కోట్ల రూపాయల వ్యయంతో మంజూరైన మౌలిక వసతుల మరమ్మతు పనులు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతుల మరమ్మతు పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోనీ 61 …
Read More »SSC పరీక్షా కేంద్రాలను సందర్శన
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు ఈ రోజు మచిలీపట్నం పట్టణంలోని SSC పరీక్షా కేంద్రాలను సందర్శించారు. CPM హై స్కూల్, చిలకలపూడి, నిర్మల హై స్కూల్, హైని హై స్కూల్, శ్రీ బాలాజీ విద్యాలయం, MEK బాలాభాను హైస్కూల్‌లను పరిశీలించారు. అలాగే నిర్మల హై స్కూల్ మరియు శ్రీ బాలాజీ విద్యాలయంలో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ పరీక్షా కేంద్రాలను కూడా సందర్శించారు. మొత్తం 7 SSC పరీక్షా కేంద్రాలను పరిశీలించి పరీక్షల నిర్వహణ విధానం, …
Read More »పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలందరికి చేరువ చేసి వారు ప్రయోజనం పొందేలా కృషి చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలందరికి చేరువ చేసి వారు ప్రయోజనం పొందేలా కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయం 5 వ బ్లాక్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన 6 వ కలెక్టర్ల సదస్సు లో రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, శాఖలధిపతులు, కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే …
Read More »కొనుగోలుదారులు… అమ్మకందారుల సమ్మేళనం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులకు కొనుగోలు చేసి చేయూత అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొనుగోలుదారులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం తాడిగడప మున్సిపాలిటీ కానూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో” కొనుగోలుదారులు… అమ్మకందారుల సమ్మేళనం’ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇందులో జిల్లాలో పలువురు స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసి ప్రదర్శనకు ఉంచిన వివిధ అకాల ఆహార ఉత్పత్తులు, వస్త్రాలు, పారిశుద్ధ్య …
Read More »
Prajavartha Online Telugu News