Breaking News

Tag Archives: machilipatnam

బందరుని మోడల్ నియోజకవర్గంగా మార్చి చూపిస్తా

– గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట – విద్య, వైద్యంతో పాటు గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం – జగన్ రెడ్డి పాలనలో రాష్ట్ర అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మార్చారు – మచిలీపట్నం రూరల్ మండలం చిన్నాపురంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రానికి మోడల్‌గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం రూరల్ మండలం చిన్నాపురం గ్రామంలో 15వ …

Read More »

ఈ నెల 9వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం..

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 9వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి మీకోసం –ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …

Read More »

జిల్లా అభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర… : జిల్లా కలెక్టర్

-జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు వివిధ రంగాలలో రాణిస్తూ జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకుని మరింత అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి కోరారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డ్వాక్రా సంఘాల మహిళలు, మహిళా వ్యాపారవేత్తలు, మహిళా ప్రభుత్వ …

Read More »

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 8 వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని తన క్యాంపు కార్యాలయం నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణ ఏర్పాట్లపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 8 వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా స్థాయి సమావేశం …

Read More »

బాలబాలికలు, యువత భద్రతపై సంబంధిత అధికారులతో సమావేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థిని విద్యార్థులు తప్పుదారి పట్టకుండా మంచి చెడుల వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలసి వారి చాంబర్లో బాలబాలికలు, యువత భద్రతపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రాను …

Read More »

తోటకూర వెంకట విజయ కుమార్ నివాసంలో సీఎం చంద్రబాబు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనమలూరు మండలం కానూరులోని తోటకూర వెంకట విజయ కుమార్ నివాసంలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులు తోటకూర గోపీచంద్, మాళవికలను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం పుష్పగుచ్చం అందచేసి వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐ జి అశోక్ కుమార్, నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి …

Read More »

ఇండ్ల జాబితా, గణన కార్యక్రమాన్ని సజావుగా చేపట్టాలి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే మే నెల 1 వ తేదీ నుండి ఇండ్ల జాబితా, గణన కార్యక్రమాన్ని సజావుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సెన్సస్ చార్జ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కృష్ణ విశ్వవిద్యాలయంలో మొదటి దశ ఇండ్ల జాబితా, ఇండ్ల గణన జిల్లా చార్జ్ స్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలో ఇండ్ల …

Read More »

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో అమృత కృష్ణ పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛమైన నీటి బాటలింగ్ యూనిట్ ను రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ రాను రాను పర్యావరణం కలుషితం అవుతుందని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై …

Read More »

జాతీయ రహదారులపై విద్యుత్ దీపాలు పనిచేయకపోతే కఠిన చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిధిలోని జాతీయ రహదారులపై విద్యుత్ దీపాలు సక్రమంగా పనిచేయకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన అజెండా అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారులపై పలుచోట్ల విద్యుత్ దీపాలు పనిచేయకపోవడం వల్ల ప్రమాదాలు …

Read More »

నూతనంగా మంజూరైన మీడియా అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా ఉంటూ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేరవేస్తూ ప్రసారమాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో 2026 27 సంవత్సరానికి నూతనంగా మంజూరైన మీడియా అక్రిడిటేషన్ కార్డులను మీడియా ప్రతినిధులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలను కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేయడంలో …

Read More »