Breaking News

దివ్యాంగ శక్తి పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు పలు రాయితీలు కల్పించడంలో భాగంగా దివ్యాంగ శక్తి పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార రాజా, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తిలతో కలసి పామర్రు లోని సచివాలయం-1 నుండి దివ్యాంగులతో ఉన్న గూడూరుకు ఒక బస్సు, కూచిపూడి కి మరో బస్సు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

పామర్రు నుండి గూడూరుకు నడిపిన బస్సులో జిల్లా కలెక్టర్ ప్రయాణించి స్వయంగా టికెట్ల యంత్రాన్ని మెడలో ధరించి గూడూరుకు ఉచిత టికెట్లను వికలాంగులకు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్యాంగుల యోగక్షేమాలను విచారిస్తూ వారు ఎక్కడ నుండి వస్తున్నారు, ఏమేం పనులు చేస్తున్నారు, ఎవరికైనా ఆర్థిక సహాయం అందించాలా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అందులో కొందరు కళ్ళం ఫణి కుమార్ రెడ్డి తనకు డైరీ అవుట్ లెట్ ఏర్పాటుకు, ఇటికాల రాంబాబు తనకు బడ్డీ కొట్టు పెట్టుకోవడానికి, శాంతిరాజు ఆటో కోసం , ఆర్థిక సహాయం అందించాలని కోరగా వెంటనే కలెక్టర్ స్పందిస్తూ వారి వివరాలను రాసుకుని బ్యాంకర్లతో అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు

అలాగే పామర్రు నుండి కూచిపూడి కి నడిపిన మరో బస్సులో పామర్రు శాసనసభ్యులు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ ప్రయాణించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగ శక్తి కార్యక్రమం ఓ వినూత్న మైన కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమం అన్నిచోట్ల ప్రారంభించడం జరుగుతుందన్నారు.
వర్గాల్లోనూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు.
గతంలో నాలుగు రకాల దివ్యాంగులకు మాత్రమే సిటీ బస్సుల్లో పూర్తి రాయితీ ఉండగా మిగిలిన బస్సుల్లో 50% రాయితీ ఉండేదన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం పైబడి వికలత్వం ఉన్న వారికి ఒకే విధంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ ,మెట్రో ఎక్స్ప్రెస్ ఇలాంటి అన్ని రకాల బస్సులలో నూటికి నూరు శాతం రాయితీ కల్పిస్తూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు.
ఈ కార్యక్రమం ఉద్దేశం మనకు చాలా రోజుల నుంచి మన దివ్యాంగులకి బస్సులో ఏం సౌకర్యం ఉంది దాన్ని చాలా వరకు మెరుగుపరచడం జరిగిందన్నారు. ఇది ఒక రకంగా వాళ్ళ జీవనోపాదులు పెంచుకునేదానికి కూడాను చాలా వరకు ఉపయోగపడుతుందన్నారు. చాలా మంది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వ్యాపారం కోసం గాని పని మీద గాని వెళ్లే దివ్యాంగులు కూడా చాలా మంది ఉన్నారన్నారు. వాస్తవంగా అలాంటి వాళ్ళందరికీ కూడాను చాలా వీలుగా ఈ యొక్క కార్యక్రమం పెట్టడం చాలా హర్షణీయం. ప్రతి ఒక్క దివ్యాంగ సోదరులు కూడాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ తరపున కోరుతున్నానన్నారు.

పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార రాజా మాట్లాడుతూ ఉగాది పండగ ఒకరోజు ముందే వచ్చిందన్నారు. .
దివ్యాంగుల మొహంలో చిరునవ్వు చూస్తున్నానన్నారు. ఎలా అయితే ఆరోజు ఇచ్చిన మాట ప్రకారం పింఛను 3000, రూపాయల నుండి 6000 రూపాయల వరకు అవసరమైతే పరిస్థితులను బట్టి 10 వేలు, 15000 ఈ రకంగా పెన్షన్లు ఇచ్చి దివ్యాంగులను ఆదుకుంటున్నామన్నారు.
అదే తరహాలో ఉచిత రవాణా సౌకర్యంగా ఈరోజు దివ్యాంగుల శక్తి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంగరంగ వైభవంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం. అన్నారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో, జిల్లా కలెక్టర్ సమక్షంలో, అదేవిధంగా గురుమూర్తి ఆధ్వర్యంలో అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందడుగు వేయటం నాకు చాలా సంతృప్తిగా సంతోషంగా ఉందన్నారు. మరి ఒక బస్సు ఇక్కడి నుంచి గూడూరు వెళ్తుంది, ఇంకో బస్సు ఇక్కడి నుంచి కూచిపూడికి దివ్యాంగులతో కలిసి తాము కూడా ప్రయాణం చేస్తున్నామన్నారు.. బస్సులో అక్కడి నుంచి ఆ కార్యక్రమానికి.చేరుకున్న తర్వాత అక్కడ ప్రభుత్వ తరపున భోజనాలు అందరం కలిసి భోజనం చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏ రకంగా దివ్యాంగుల అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం కట్టుబడి ఉంటుందని చెప్పారు. 21 నెలల్లోనే ఈ రకంగా అన్ని పథకాలను అమలు చేసిందన్నారు.

గౌడ కార్పొరేషన్ చైర్మన్ వెంకట గురుమూర్తి మాట్లాడుతూ ఎంత బ్రహ్మాండంగా దివ్యాంగులందరూ కూడా సంతోషంగ ఈ రోజు నుంచి బస్ టికెట్ అవసరం లేదు. బస్సు ప్రయాణం చేయవచ్చన్నారు.తద్వారా ఒక ధైర్యాన్ని, మనోధైర్యం, ఆత్మగౌరవాన్ని, ఆత్మ ధైర్యాన్ని దివ్యాంగులందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారన్నారు
దివ్యాంగులు పైకి ఎదగడానికి ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం అందజేస్తుందన్నారు.

ఆ ప్రకారం బస్సులో గూడూరు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక అధికారి ద్వారా భోజన వసతి ఏర్పాట్లు చేశారు.
అలాగే కూచిపూడి బస్టాండుకు చేరుకున్న బస్సులోని దివ్యాంగులకు అక్కడే భోజనం ఏర్పాటు చేసి శాసనసభ్యులు చైర్మన్ వారితో కలిసి భోజనం చేశారు.

ఈ కార్యక్రమంలో పామర్రు నియోజకవర్గం ప్రత్యేక అధికారి డ్వామా పీడీ శివప్రసాద్, ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్ నీలిమ, సహాయ మేనేజర్ జేమ్స్, కంట్రోలర్ కేఎస్ రావు, తహసిల్దారు రవికాంత్, డిప్యూటీ ఎంపీడీవో గంగాధరరావు, గూడూరు ఎంపీడీవో శైలజా కుమారి తదితర అధికారులు, పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *