మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు ఈ రోజు మచిలీపట్నం పట్టణంలోని SSC పరీక్షా కేంద్రాలను సందర్శించారు. CPM హై స్కూల్, చిలకలపూడి, నిర్మల హై స్కూల్, హైని హై స్కూల్, శ్రీ బాలాజీ విద్యాలయం, MEK బాలాభాను హైస్కూల్‌లను పరిశీలించారు. అలాగే నిర్మల హై స్కూల్ మరియు శ్రీ బాలాజీ విద్యాలయంలో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ పరీక్షా కేంద్రాలను కూడా సందర్శించారు. మొత్తం 7 SSC పరీక్షా కేంద్రాలను పరిశీలించి పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను తనిఖీ చేసి అవసరమైన సూచనలు చేశారు. పరీక్షలు సజావుగా మరియు పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Prajavartha Online Telugu News