Breaking News

ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం దివ్యాంగ శక్తి ప్రారంభ కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 18వ తేదీ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం దివ్యాంగ శక్తి ప్రారంభ కార్యక్రమం ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్ నుండి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభ కార్యక్రమం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం దివ్యాంగులకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం అన్ని నియోజకవర్గ స్థాయిలలో సంబంధిత శాసనసభ్యులభాగస్వామ్యంతో సజావుగా నిర్వహించాలన్నారు. ఆయా ప్రాంతాల దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పై అంతస్తులో కాకుండా క్రింద భవనంలోనే భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు.

ఈ టెలికాన్ఫరెన్స్లో డిఆర్ఓ చంద్రశేఖర రావు, వయోవృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి కామరాజు, డి పి టి ఓ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ డిఎం పెద్దిరాజు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు మార్కెటింగ్ ఏడి నిత్యానందం, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, మెప్మా పీడీ సాయిబాబు , జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, డ్వామా పీడీ శివ ప్రసాద్, జడ్పీసీఈఓ కన్నమ నాయుడు, మార్క్ఫెడ్ డి ఎం మురళీ కిషోర్, మచిలీపట్నం గుడివాడ ఉయ్యూరు ఆర్డిఓ లు సాంబశివరావు బాలసుబ్రమణ్యం శ్రీదేవి తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *