Breaking News

నా చివరి రక్తపు బొట్టు వరకు బందరు కోసం శ్రమిస్తా

-ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం బీచ్, నేటి పత్రిక ప్రజావార్త :
మసులా బీచ్ ఫెస్ట్-2025లో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నంలో ఇలాంటి జన సునామీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.. దేశంలో ఏ బీచ్ లో కూడా ఇలాంటి ఫెస్ట్ జరగలేదన్నారు. ఇలాంటి కార్యక్రమం విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలన్నారు. బందరు పర్యాటక అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పడమే నా లక్ష్యం అన్నారు.. రేపల్లె మచిలీపట్నం రైల్వే మార్గం పూర్తి చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. 2014-19 మధ్య బందరులో ఉన్న పర్యాటక అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నాం.. సింగపూర్, దుబాయ్ లాంటి దేశాలకు పర్యాటకమే ఆదారమన్నారు ..మన రాష్ట్రంలో కూడా అద్భుతమైన అవకాశాలున్నాయన్నారు. పోరాటంతో సాధించుకున్న పోర్టును జూన్ 2026 నాటికి పూర్తి చేస్తామన్నారు.. పల్లెతుమ్మలపాలెంలో క్రిటికల్ మినరల్ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు .. తద్వారా ఇక్కడి నుండి వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.. తప్పుడు కేసుతో నన్ను 53 రోజులు పాటు రాజమండ్రి జైల్లో పెట్టినపుడు బాధపడ్డానన్నారు.. తప్పుడు కేసు పెట్టీ జైల్లో పెట్టినపుడు నిద్రలేని రాత్రులు గడిపానన్నారు.. బందరు ప్రజలు ఇచ్చిన పునర్జన్మతో మళ్ళీ ఈ రోజు మీ ముందు నిలబడ్డా, నా చివరి రక్తపు బొట్టు వరకు బందరు అభివృద్ధి కోసం శ్రమిస్తానన్నారు.. ప్రజల సహకారంతో బందరు అభివృద్ధి చేసి చూపిస్తా..
బందరు ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో ఉపాధికి కేంద్రంగా మారుస్తా, బీచ్ ఫెస్ట్ కోసం నెల రోజుల నుండి శ్రమించిన అధికారులందరికీ ధన్యవాదాలన్నారు.. అర్ధరాత్రులు శ్రమించి పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్న పారిశ్రామిక సిబ్బందికి ధన్యవాదాలన్నారు. పోలీస్, రెవెన్యూ సహా ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు రేయింబవళ్ళు శ్రమించిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం అని మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు.

రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ…
గత ప్రభుత్వంలో ఎప్పూడూ ఎక్కడ ఇలాంటి వేడుక నిర్వహించిన దాఖలాలు లేవన్నారు.. గత ప్రభుత్వం హయాంలో పులికాట్ లో ఫ్లెమింగో ఫెస్టివల్, మంగినపూడిలో మసులా బీచ్ పండుగను పట్టించుకోలేదన్నారు. మన ప్రభుత్వం వచ్చాకే ఈ రెండు ఫంక్షన్స్ ఘనంగా నిర్వహించామన్నారు. పెట్టుబడిదారులే కాదు.. పక్షులు.. పర్యాటకులు కూడా పారి పోయాయని విమర్శించారు. మన ప్రాంతంలో టూరిజంను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందన్నారు.. అంతర్జాతీయ కబడ్డీ, వాలీబాల్ లు ఈ ప్రాంతంలో జరిపిస్తామన్నారు.. కూటమి ప్రభుత్వం మంచి సంకల్పంతో మంత్రి రవీంద్ర చేసిన ప్రయత్నాన్ని మీరంతా గ్రాండ్ సక్సెస్ చేశారన్నారు.. అందుకు అందరికీ ధన్యవాదాలన్నారు.. మచిలీపట్నం అభివృద్ధి చేయాలని కొన్నేళ్లుగా రవీంద్ర, మేము పాటు పడుతున్నామన్నారు.

ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ.. బందరు అభివృద్ధి కి ఎంతో కాలంగా పని చేస్తున్నామ న్నారు… బీచ్ కళకళలాడే విధంగా చేయాలని కోరిక సాధించే వరకు కృషి చేస్తామన్నారు .. మంత్రి కొల్లు రవీంద్ర కృషి, ముఖ్యమంత్రి సహకారం తో కృషితో పోర్టు నిర్మాణం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో ఛైర్మన్స్ బండి రామక్రిష్ణ, వీరంకి గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *