-హేలీ రైడ్ తో బీచ్ పరిసరాలను పరిశీలించిన మంత్రి
-కొల్లు రవీంద్ర, మంత్రి రాష్ట్ర గనులు, భూ గర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ లో జరుగుతున్న మసులా బీచ్ ఫెస్టివల్-2025 లో భాగంగా హెలీ రైడ్స్ ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో కలసి ప్రారంభించారు. అనంతరం హెలికాప్టర్ లో బీచ్ పరిసర ప్రాంతాలతోపాటు మసులా బీచ్ కి వచ్చే పర్యాటకులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద ఈవెంట్ గా గుర్తింపు పొందిన ఈ ఫెస్టివల్ జూన్ 5 నుంచి 8 వ తేదీ ఆదివారం వరకు కొనసాగనుంది.
Prajavartha Online Telugu News