Breaking News

క్యాపిటల్‌ హాస్పిటల్‌లో అరుదైన గుండె శస్త్రచికిత్స

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశంలోనే తొలిసారిగా, విజయవాడలోని క్యాపిటల్‌ హాస్పిటల్స్‌లో చీఫ్‌ సిటీ సర్జన్‌ అయిన డాక్టర్‌ కె.హేమకృష్ణసాయి ఒక రోగికి ‘‘ఎఆర్టిక్‌ రూట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ వయా బోయాంగ్‌ టెక్నిక్‌తో పాటు బృహద్దమని వాల్వ్‌ రీప్లేస్మెంట్‌, మిట్రల్‌ వాల్వ్‌ రీప్లేస్మెంట్‌. ఎల్‌ ఏ రిడక్షన్‌ & ట్రెకస్సిడ్‌ వాల్వ్‌ రిపేర్‌’’ను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. శుక్రవారం పోరంకిలోని క్యాపిటల్‌ హాస్పిటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ కృష్ణ సాయి మాట్లాడుతూ ‘‘2021లో డాక్టర్‌ బోయాంగ్‌ ప్రవేశపెట్టిన వై-ఇన్సిషన్‌ టెక్నిక్‌ని ఉపయోగించి భారతదేశంలో మొదటిసారిగా మేము చాలా సంక్లిష్టమైన మరియు అరుదైన ప్రక్రియను నిర్వహించామన్నారు. దీనివలన వాల్వ్‌-ఇన్‌-వాల్వ్‌ విధానాల ప్రమాదాన్ని తగ్గిస్తుందన్నారు. విజయవాడలోని గుణదలలో నివసిస్తున్న 31 ఏళ్ల చిక్కాల కోటేశ్వరి 5 సంవత్సరాలుగా చిన్న బృహద్దమని మూల వ్యాధితో బాధపడుతున్నారు. పలు ఆసుపత్రిలలో సంప్రదించినా సరైన స్వస్థత కనిపించకపోవడంతో క్యాపిటల్స్‌లో సంప్రదించగా ఆమెకు ట్రిపుల్‌ వాల్వ్‌ సర్జరీతో బృహద్దమని మూల విస్తరణ అనే శస్త్ర చికిత్సతో పరిపూర్ణ ఆరోగ్యవంతురాలు అయ్యే విధంగా చికిత్స నిర్వహించినట్లు తెలిపారు. డాక్టర్‌ హేమకృష్ణ సాయితోపాటు చీఫ్‌ అనస్థీషియాలజిస్ట్‌ డాక్టర్‌ ఎం.శ్రీధర్‌ సహాయంతో మరియు చీఫ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ విఎస్‌ఆర్‌ భూపాల్‌ల టీమ్‌తో కలిసి డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవా పథకంలో శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలిపారు. ఈ శస్త్రచికిత్స మా సర్జన్‌ మరియు క్యాపిటల్‌ హాస్పిటల్స్‌ను అత్యుత్తమ కేంద్రంగా గుర్తింపు ఇస్తోంది అని మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.సురేష్‌ చెప్పారు. డాక్టర్‌ హేమ కృష్ణసాయితోపాటు వారి నిపుణుల బృందం సాధించిన అద్భుతమైన విజయం అని ఈ నిపుణుల బృందంతో అన్ని రకాల కార్డియాక్‌ సర్జరీలను నిర్వహించడానికి మేము ఎప్పుడూ అందుబాటులో వుంటామని క్యాపిటల్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హరీష్‌ మన్నె అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య బృందంతోపాటు హాస్పిటల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *