Breaking News

Tag Archives: machilipatnam

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జల క్రీడల శిక్షణ కేంద్రం ఏర్పాటు… : జిల్లా కలెక్టర్

-నిర్మాణానికి రూ.2 కోట్ల జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్ నిధులు నాగాయలంక, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు రూ.2 కోట్ల నిధులతో నాగాయలంకలో జల క్రీడల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి నాగాయలంకలో జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్ రూ.2 కోట్ల నిధులతో నిర్మిస్తున్న జల క్రీడల శిక్షణ కేంద్ర నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో …

Read More »

మత్స్య సంపద యూనిట్లు సజావుగా నెలకొల్పుటకు తగిన చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మత్స్య సంపద యూనిట్లు సజావుగా నెలకొల్పుటకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని వారి చాంబర్లో మత్స్య సంపద యూనిట్లు నెలకొల్పుటకు జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2020-21 సంవత్సరంలో మొదలై 2023-24 సంవత్సరంతో ముగుస్తోందన్నారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 2.60 కోట్ల రూపాయలు …

Read More »

ప్లాస్టిక్ వాడకం నియంత్రించడానికి జిల్లాలో పటిష్టమైన చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లే ప్లాస్టిక్ వాడకం నియంత్రించడానికి జిల్లాలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని వారి చాంబర్లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం పై క్షేత్రాధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం రాను రాను ఎక్కువై మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతోందన్నారు. జిల్లాలో ప్లాస్టిక్ వాడకంపై దుష్పరిణామాలను ప్రజలకు, ప్లాస్టిక్ విక్రయించే దుకాణదారులకు, వ్యాపారస్తులకు …

Read More »

స్వచ్ఛ ఆంధ్ర @ 2047

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం( పి4)తో ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వారి చాంబర్లో స్వచ్ఛ ఆంధ్ర @ 2047 గోడపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర @ 2047 దిశగా ముందడుగు వేస్తుందని, సమాజంలో ఉన్న 20 శాతం అత్యంత నిరుపేదల అభ్యున్నతికి పి- 4 మోడల్ – ప్రభుత్వ, దాతల …

Read More »

జీవనోపాదుల పురోభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా జీవనోపాదుల పురోభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ జీవనోపాదుల పురోభివృద్ధి కోసం సంబంధిత జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 13వ తేదీన గురువారం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)సీఈవో జిల్లాకు రానున్నారని వారు జిల్లాలో సామర్థ్యం ఉన్న …

Read More »

యధావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

-ఈనెల 10వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 10వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. శాసనమండలి ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున కొంతకాలం పి జి ఆర్ ఎస్ …

Read More »

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో విరివిగా పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, రుణాలు మంజూరులో బ్యాంకర్లు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శుభం కన్వెన్షన్ హాల్లో మెగా ఎంఎస్ఎంఇ ఔట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతం మన జిల్లా అని, బ్యాంకర్లు …

Read More »

పేద‌రిక నిర్మూలన ల‌క్ష్యంగా పీ4 స‌ర్వే

-ఈ నెల 8 నుంచి 18 వ‌ర‌కు స‌చివాల‌య సిబ్బంది ద్వారా కార్య‌క్ర‌మం -జిల్లా క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పేద‌రిక నిర్మూలన ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప‌బ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్ పార్ట‌న‌ర్‌షిప్ (పీ4) స‌ర్వేకు రూప‌క‌ల్ప‌న చేయ‌డం జ‌రిగింద‌ని, ఈ నెల 8 నుంచి 18వ తేదీ వ‌ర‌కు జరిగే సర్వేను వేగవంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార …

Read More »

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి…

-జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలో ఆ రోజు వేడుకలు ఘనంగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మెప్మా, డి ఆర్ డి ఏ, ఐసిడిఎస్, మైనారిటీ, పోలీసు, మున్సిపల్, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులతో జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై …

Read More »

వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వేసవిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్, ఇరిగేషన్, ఐసిడిఎస్ తదితర శాఖల అధికారులతో వేసవిలో తాగునీటి సమస్యకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో …

Read More »