Breaking News

జీవనోపాదుల పురోభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా జీవనోపాదుల పురోభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ జీవనోపాదుల పురోభివృద్ధి కోసం సంబంధిత జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 13వ తేదీన గురువారం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)సీఈవో జిల్లాకు రానున్నారని వారు జిల్లాలో సామర్థ్యం ఉన్న వివిధ రకాల జీవనోపాదుల పురోభివృద్ధికి చర్యలు తీసుకునేందుకు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి చర్చించనున్నారన్నారు. కొత్తగా వస్తున్న పారిశ్రామికవేత్తలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర విషయాలపై కూడా వివరాలు అందజేయాలన్నారు. ఇందుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి హరిహరనాథ్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి చిన్న నరసింహులు, వ్యవసాయ శాఖ డిడి మనోహర్, ఎఎల్డిఎమ్ లోకేష్, చేనేత జౌలి శాఖ ఏడి సాయి ప్రసాదు జిల్లా పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *