Breaking News

వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న వేసవిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్, ఇరిగేషన్, ఐసిడిఎస్ తదితర శాఖల అధికారులతో వేసవిలో తాగునీటి సమస్యకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మచిలీపట్నం, పెడన, గుడివాడ, ఉయ్యూరు, తాడిగడప మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టి లీకైన పైప్ లైన్లు, చేతిపంపులకు మరమ్మతులు చేపట్టడం వంటి పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అవసరమైన పనులకు నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.

మచిలీపట్నం, పెడన మున్సిపాలిటీలకు తరకుటూరు స్టోరేజ్ నుంచి తాగునీరు సరఫరా అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏప్రిల్ నెలలో కాలువలకు నీటిని విడుదల చేసినప్పుడు పూర్తిస్థాయిలో నింపాలన్నారు. అదేవిధంగా గ్రామీణ శివారు ప్రాంతాలలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిస్థాయిలో నింపే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాలలో ట్యాంకర్లతో తాగునీటిని అందించాలన్నారు. గుడివాడలోని టిడ్కో గృహ సముదాయాలకు సరఫరా చేస్తున్న నీరు సరిపోవటం లేదని, నీటి వనరులను పెంచాల్సిన అవసరం ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ప్రస్తుతం సమస్య తలెత్తకుండా ఉండేందుకు అదనంగా ట్యాంకర్లతో సరఫరా చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వాహక అధికారి నటరాజన్, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, సిపిఓ గణేష్ కృష్ణ, మున్సిపల్ కమిషనర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *