-పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 7వ తేదీ శుక్రవారం గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్ లో స్వర్ణ పంచాయితీ వెబ్ సైట్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ లాంచనంగా ప్రారంభించనున్నారన్నారు. కార్యక్రమానికి చేపట్టవలసిన ఏర్పాట్లను మంగళవారం ఉదయం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, డైరక్టర్ యం.కృష్ణ తేజ , జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ ఆర్. గంగాధర రావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలసి గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణాన్ని, గ్రౌండ్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ ఈనెల 7వ తేదీ శుక్రవారం రాష్ట్రస్థాయిలో నిర్వహించే స్వర్ణ పంచాయతీ వెబ్ సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సుమారు ఐదు వేలకు పైగా ప్రజలు హాజరుకానున్నారన్నారు. శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేసి సిద్ధం చేయాలన్నారు. ముఖ్యంగా పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్, ఉపాధి హామీ, ఆర్ డబ్ల్యూఎస్ తదితర శాఖలు పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో నిర్మాణం చేపట్టి పూర్తి చేసిన రహదారులు, గోకులాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పొడి తడి చెత్త, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు, ఇ – వేస్ట్ ,స్వచ్ఛ చర్లపల్లి కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నారు.
డయాస్పై ప్రోటోకాల్ ప్రకారం సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉండాలని, బ్యాక్ డ్రాప్ ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర కార్యాలయం ను సంప్రదించి సిద్ధం చేసుకోవాలన్నారు. పటిష్టమైన బ్యారి గేడింగ్ ఏర్పాటు చేయాలని, డిప్యూటీ సీఎం, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు తాత్కాలిక బస కు గ్రీన్ రూమ్ ఏర్పాటు ఉండాలన్నారు. కళాశాల ప్రాంగణం, మైదానంలో జంగిల్ క్లియరెన్స్ చేసి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వెబ్ సైట్ ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని సాంకేతిక పరికరాలు సిద్ధం చేసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు.
జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు మాట్లాడుతూ కార్యక్రమానికి పట్టిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం కాన్వాయ్ కి ఇబ్బంది లేకుండా బ్యారి కేడింగ్ చేయాలన్నారు. పోలీస్ అధికారులు ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేసేలా ఆదేశించామని జిల్లా ఎస్పీ అన్నారు. ఏర్పాట్ల పరిశీలనలో జడ్పీ సీఈవో కె .కన్నమ్మ నాయుడు, గుడివాడ ఆర్డిఓ జి. బాలసుబ్రమణ్యం, డిపిఓ జే. అరుణ, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్వి శివప్రసాద్ యాదవ్, తహసిల్దార్ శివయ్య ఉన్నారు.
Prajavartha Online Telugu News