-జప్తు నోటీసులు జారీ చేయండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎక్కువగా పన్ను బకాయలు ఉన్న ప్రాంతాలను ఫీల్డ్ విజిట్ చేసి పరిశీలించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం సాయంత్రం తన పర్యటనలో భవానిపురం పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎక్కువ కాలం నుండి పన్ను బకాయిలు ఉన్న వారికి చట్టపరంగా నీటి కుళాయిలు, భూగర్భ డ్రైనేజీ కనెక్షన్లు తొలగించాలని, జప్తు నోటీసులు జారీ చేయాలని, పన్ను బకాయి మొత్తం చెల్లించాక తిరిగి వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మార్చి 31, 2025 వరకు విజయవాడ నగరపాలక సంస్థ వారి అన్ని క్యాష్ కౌంటర్లు సెలవు దినాల్లో కూడా పనిచేయునని ప్రజలందరూ సకాలంలో వివిధ రకాల పన్నులు చెల్లించి విజయవాడ నగరాభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరారు. ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, అసిస్టెంట్ కమిషనర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News