Breaking News

ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమం ఏర్పాట్లు పూర్తి

ఆత్కూరు(ఉంగుటూరు), నేటి పత్రిక ప్రజావార్త :
ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టులో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమమునకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు గురువారం రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉంగుటూరు మండలం, ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో జరగనున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 57వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ అధికారులకు ఈ సందర్భంగా సూచించారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంట సహాయ కలెక్టర్ ఫరీద్ జైద్, గుడివాడ ఆర్డిఓ జి బాలసుబ్రమణ్యం, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జి రామచంద్రరావు, ప్రొఫెసర్లు ఇతర అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *