మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 2025 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసి బందరు పోర్టు ప్రారంభించుటకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రి గురువారం తమ నివాసంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలో పర్యటించి స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని ప్రారంభించడం, డంపింగ్ యార్డ్ సందర్శించి అక్కడ పరిస్థితిని పరిశీలించడం, అదేవిధంగా బందరు పోర్టు ఆకస్మికంగా సందర్శించి పనులు …
Read More »Tag Archives: machilipatnam
నగర సుందరీకరణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగర సుందరీకరణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి ఛాంబర్లో మునిసిపల్ అధికారులు, ముడా అధికారులతో కలిసి మచిలీపట్నం అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముడా పరిధిలోని పోర్టు డంప్యార్డు లేఔట్లు ఉన్న రేఖా చిత్రపటాన్ని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి డివైడర్ లపై వివిధ కళాకృతులతో …
Read More »జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం జిల్లా స్థాయి క్రీడల అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలోని గ్రామపంచాయతీలు మున్సిపాలిటీల ద్వారా మూడు శాతం స్పోర్ట్స్ సెస్ వసూళ్లపై సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీని ఆర్థికంగా పటిష్టం చేసేందుకు జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు నగరపాలక సంస్థల నుండి జీవో నెంబర్ 84 ద్వారా 3 …
Read More »బందరు పోర్ట్ ను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా లో పర్యటనలో భాగంగా మచిలీపట్టణం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటనలో స్వల్ప మార్పు చేసుకున్నారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో రాష్ట్ర గనులు, ఆబ్కారీ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి చేసిన విజ్ఞప్తి మేరకు మచిలీపట్టణం పోర్ట్ ను అధికారులతో కలిసి బుధవారం ముఖ్యమంత్రి పరిశీలించారు. అధికారులు, పోర్ట్ ఇంజినీర్లతో కలిసి బందరు పోర్ట్ మాస్టర్ ప్లాన్ పరిశీలించి, క్షేత్రస్థాయిలో అక్కడి పరిస్థితులను పరిశీలించి వాటి వివరాలను …
Read More »2029 నాటికి స్వచ్చ ఆంధ్రప్రదేశ్
-గత ప్రభుత్వం ప్రజల నెత్తిన మోపిన చెత్తపన్నును రద్దు చేస్తున్నాం -పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరూ పుట్టిన రోజు, శుభకార్యం రోజున చెట్టు నాటండి -మన ఆరోగ్యాన్ని కాపాడే స్వచ్ఛ సేవకులను గౌరవించాలి -2025 డిసెంబర్ నాటికి బందరు పోర్టు నిర్మిస్తాం..గత పాలకుల నిర్లక్ష్యంతో పనులు ఆలస్యం -గాంధీ సిద్ధాంతాలు భావితరాలకు ఆదర్శం…ఆయన ఆశయాలకు అనుగుణంగా అంతా పనిచేద్దాం -మచిలీపట్నం మెడికల్ కళాశాలకు జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య పేరు -స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -పారిశుధ్య …
Read More »బందరు పోర్ట్ నిర్మాణం 2025 అక్టోబర్ లోగా పూర్తి
-గత ప్రభుత్వ సమయంలో బ్రష్టుపట్టిన వ్యవస్థలన్నిటినీ గాడిలో పెడతాం -నేషనల్ కాలేజీ ని స్వాధీనం చేసుకుని ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తాం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో బ్రష్టుపట్టిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. కృష్ణా జిల్లాలో పర్యటనలో భాగంగా మచిలీపట్నంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణంలో ఎ.జె కళాశాలలో పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వం …
Read More »పరిశుభ్రత ప్రతీ ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రత ప్రతీ ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. స్థానిక ఏ జె. కళాశాల ఆవరణలో ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పారిశుధ్య కార్యక్రమంలో అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం గ్రామాల అభివృద్ధి ద్వారానే సాధ్యమన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే రోగాలు, అంటువ్యాధులు మన …
Read More »ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం 11 గంటలకు మచిలీపట్టణం చేరుకున్నారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి నుండి హెలికాప్టర్ లో మచిలీపట్టణం ఏ .జె. కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన హెలిపాడ్ కు చేరుకున్న ముఖ్యమంత్రి కి రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి , ఎమ్మెల్సీ కంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యే లు వెనిగళ్ళ రాము, కాగిత కృష్ణ ప్రసాద్ , వర్ల …
Read More »జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచన విధానాలు అందరికీ అనుసరణీయం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచన విధానాలు అందరికీ అనుసరణీయం ఆదర్శనీయమని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆప్కారి శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం నగరంలోని నోబుల్ కళాశాలలో ఏర్పాటుచేసిన వ్యర్థాలతో 800 కళా ప్రదర్శనలను మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో కలిసి సందర్శించారు. కళాకృతులు చాలా బాగున్నాయని మంత్రి కలెక్టరు విద్యార్థులను అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రివర్యులు మాట్లాడుతూ మహాత్మా …
Read More »స్వచ్ఛత హి సేవ ప్రతిజ్ఞ మరియు పోస్టర్ల ఆవిష్కరణ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం మై భారత్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ సాగర్ సుందర్ సాగర్ నినాదం తో క్లీన్లినెస్ ఆఫ్ బీచెస్ లొ ఈరోజు మచిలీపట్నం మంగినపూడి సముద్ర తీరన స్వచ్ఛతాహి సేవ ముగింపు కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులందరి చేత గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు పూలమాలవేసి చేసిన సేవలను కొనియాడారు అనంతరం స్వచ్ఛత హి సేవ ప్రతిజ్ఞ …
Read More »