మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పుటకు అవసరమైన భూముల అలినేషన్, ముటేషన్ చేయుటకు ప్రతిపాదనలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ చంద్రశేఖర రావుతో కలిసి రెవెన్యూ శాఖ, ఏపీఐఐసీ అధికారులతో సమావేశం నిర్వహించి భూముల అలినేషన్, ముటేషన్, 22 ఏ తొలగింపులు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …
Read More »Tag Archives: machilipatnam
కులాలు వేరైనా అందరూ ఐక్యంగా ఉండాలి…
–రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ చినగొల్లపాలెం, నేటి పత్రిక ప్రజావార్త : కులాలు వేరైనా అందరూ ఐక్యంగా ఉండాలని, మానవతా దృక్పథంతో సామరస్యంగా మెలగాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ప్రజలను కోరారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన అధికారులతో కలిసి కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం బీచ్ వద్ద కొన్ని కులాల మధ్య తలెత్తిన భూ సమస్యలను విచారించారు. భూ సమస్య ప్రాంతాన్ని పరిశీలించి ఆయా కుల సంఘ పెద్దలు, గ్రామస్తులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం …
Read More »మురుగునీటి వ్యవస్థను మెరుగుపరిచే సమగ్ర ప్రాజెక్టు నివేదికను త్వరగా సిద్ధం చేసి అందజేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం మురుగునీటి వ్యవస్థను మెరుగుపరిచే సమగ్ర ప్రాజెక్టు నివేదికను త్వరగా సిద్ధం చేసి అందజేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఢిల్లీ ప్రతినిధులను కోరారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రజా ఆరోగ్య పర్యావరణ ఇంజనీరింగ్ సంస్థ( సి పి హెచ్ ఈ ఈ ఓ) ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ను మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని వారి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మచిలీపట్నంలో …
Read More »ప్రతి ఒక్కరు యోగా శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంపూర్ణ ఆరోగ్యానికి యోగ ఎంతగానో ఉపకరిస్తుందని, ఉద్యోగులు ప్రతి ఒక్కరు యోగా శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం నగరంలోని జడ్పీ కన్వెన్షన్ హాలులో జిల్లా కలెక్టర్ చొరవతో తొలిసారిగా జిల్లా అధికారులు, ఉద్యోగులకు ఉచిత ప్రత్యేక యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి యోగా శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యోగా …
Read More »భూసేకరణ సమస్యలు పరిష్కరించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, పోర్టు కనెక్టివిటీ రైలు రోడ్డు మార్గాల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పోర్టు, మేరీ టైం బోర్డు, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు అభివృద్ధి పనుల్లో భాగంగా పోర్టు కనెక్టివిటీ రైల్ రోడ్డు మార్గాల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ సమస్యలపై సమీక్షించారు. …
Read More »ప్రభుత్వం ప్రజల సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేస్తుంది…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రజల సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. సోమవారం మంత్రి మచిలీపట్నం రహదారులు భవనాలు అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం అప్రజాస్వామిక పాలన వలన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా, …
Read More »కోర్టు కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కోర్టు కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సకాలంలో కౌంటర్ ఫైళ్ళు , అప్పీలు దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించి కోర్టు కేసులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ఆ వారంలో ఉన్న కోర్టు కేసుల గురించి చర్చించడం జరుగుతుందని, ఏదైనా కోర్టు ఉత్తర్వులు ఉంటే …
Read More »ప్రజా సమస్యల పట్ల తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పట్ల తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశం మందిరం లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక— “మీకోసం కార్యక్రమం” నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యలను ఎంతో ఓపిగ్గా విని సంబంధిత శాఖల అధికారులను పిలిపించి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు …
Read More »మంత్రి కొలుసు పార్థసారథిని కలిసిన ప్రముఖులు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మచిలీపట్నం రహదారులు భవనాల అతిధి గృహానికి సోమవారం చేరుకోగా వారిని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా పోలీస్ అధికారి గంగాధర్ రావు జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు ఆర్డిఓ ఎం వాణి హౌసింగ్ పీడీ సూర్యనారాయణ, సమాచార పౌర సంబంధాల అధికారి ఎం వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి ఏం పద్మావతి పార్వతి డిఎస్ఓ పార్వతి తదితర …
Read More »రైతును ఆర్థికంగా నిలబెట్టే ఆయిల్ పామ్ సాగు .. జిల్లా కలెక్టర్
పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : ఆయిల్ పామ్ తోటల సాగు రైతును ఆర్థికంగా నిలబెడుతుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందగలిగే ఆయిల్ పామ్ సాగు పట్ల రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులు, సిబ్బందికి సూచించారు. సోమవారం మధ్యాహ్నం పామర్రు ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై గ్రామస్థాయి ఉద్యాన, వ్యవసాయ శాఖల సహాయ సిబ్బందికి, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయిల్ పామ్ సాగు …
Read More »