Breaking News

హజ్ తో ముగియనున్న బక్రీద్ పండుగ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హజ్ అనేది సౌదీ అరేబియాలోని మక్కాకు చెందిన వార్షిక ఇస్లామిక్ తీర్థయాత్ర. ప్రతి ముస్లిం వ్యక్తి ఇది జీవితకాలంలో ఒకసారైనా చేయాల్సి ఉంటుంది .కొంతమంది ముస్లింలు ఒకటి కంటే ఎక్కువ సార్లు కూడా ప్రయాణం చేస్తారు. ఆర్థికంగా, శారీరకంగా ధృడంగా ఉన్న వాళ్ళు హజ్ యాత్ర చేస్తారు. విశ్వాసం, ప్రార్థన, క్షమాపణ, ఉపవాసం ప్రాముఖ్యతను యాత్ర తెలియజేస్తుంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ నెలలో ఈ యాత్ర చేపడతారు. ఐదు రోజుల పాటు సాగుతుంది. బక్రీద్ పండుగతో హజ్ యాత్ర ముగుస్తుంది. హజ్ చేయడం అనేది మతపరమైన బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చినట్లు అర్థం. చాలామందికి జీవితకాలంలో లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తుంది .గత పాపాలను క్షమించమని కోరుకుంటూ భగవంతుడని దర్శించుకుని దేవుడికి దగ్గరగా ఉండేందుకు, ప్రవక్తల అడుగుజాడల్లో నడిచేందుకు ఇది ఒక అవకాశంగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులను ఒక్కటికి చేర్చే ఏకైక ప్రదేశం ఇది. ఐక్యత, అనుబంధం, వినయం, సమానత్వం అనే భావాన్ని హజ్ యాత్ర కలిగిస్తుంది.

హజ్ యాత్ర సాగేది ఇలా..
మక్కాకి చేరుకున్న తర్వాత ఉమ్రా అనే ఆధ్యాత్మిక యాత్ర చేపడతారు. ఇది హజ్ యాత్రలో తప్పనిసరి కాకపోయినా కొంతమంది చేస్తారు. అక్కడ ఉన్న కాబా చుట్టూ ప్రదక్షిణలు చేయడం, దాన్ని ముట్టుకోవడం, ప్రార్థనలు చేయడం చేస్తారు. తాము చేసిన పాపాలను క్షమించమని వేడుకుంటారు. ఈ ఆచారాన్ని ‘తవాఫ్’ అంటారు. మక్కాలోని కాబా చుట్టూ అపసవ్య దిశలో ఏడుసార్లు ప్రదక్షిణలు చేస్తారు. కాబాను పూజించరు. క్యూబ్ ఆకారపు నిర్మాణాన్ని వారు దేవుని స్వరూపంగా భావిస్తారు. ఉమ్రా యాత్ర తర్వాత మీనా పట్టణానికి వెళ్తారు. ఇది మక్కాకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి హజ్ యాత్రికులు అరాఫత్ మైదానం లోని జమరత్ దగ్గర సైతాన్ ను రాళ్ళతో కొట్టీ మేక గొర్రెను బలి ఇస్తారు.

ఈద్ ఉల్ అదాను బక్రీద్ అంటారు. ముస్లింల జరుపుకునే అత్యంత పవిత్రమైన ముఖ్యమైన పండుగలలో ఇదీ ఒకటి. ప్రవక్త ఇబ్రహీం అల్లా ఆజ్ఞ మేరకు తన కుమారుడైన ఇస్మాయిల్ ని బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు. కానీ దేవుడు తనని ఆపి ఒక గొర్రెను బలి ఇవ్వమని చెప్తారు. అందుకే బక్రీద్ రోజున ముస్లింలు మేకలు, గొర్రెలను బలి ఇస్తారు. తాజా మాంసాన్ని అందరికీ పంచి పెడుతూ పండుగ వేడుక చేసుకుంటారు.

ఈద్-ఉల్ అదా దుల్హ హిజ్జా 10 వ రోజున వస్తుంది. ఇస్లామిక్ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఇది 12వ నెల. బక్రీదు రోజు ముస్లింలందరూ ప్రార్థనలు చేసేందుకు మసీదులకు వెళ్తారు. దీన్ని సలాత్ అల్ ఈద్ అంటారు. అనంతరం జంతుబలి చేస్తారు. మాంసాన్ని అందరికీ పంచిపెడుతూ సమాజంలోని పేదల పట్ల తమ దాతృత్వాన్ని చాటుకుంటారు. అందుకే దీనిని బక్రీద్ అంటారు.

Check Also

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాను : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *