గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో శానిటరీ డివిజన్లను 22నుండి 32కి పెంపు చేసి, దీర్ఘకాలంగా ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నఇన్స్పెక్టర్లను కూడా డివిజన్ల మార్పు చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పెరిగిన గుంటూరు నగర పరిధి దృష్ట్యా, మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టడానికి వీలుగా ప్రస్తుతం ఉన్న 22 శానిటరీ డివిజన్లను 32 డివిజన్లుగా పెంపు చేశామన్నారు. అలాగే దీర్ఘ కాలంగా ఒకే డివిజన్లో విధులు నిర్వహిస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్లను కూడా బదిలీ చేశామని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ, సుందర నగరంగా గుంటూరుని పరిరక్షించడంలో ప్రజారోగ్య విభాగం కీలకమని, అటువంటి ప్రాధాన్యత విభాగంలో విధులు నిర్వహించే కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు భాధ్యతగా ఉండాలన్నారు. తమకు కేటాయించిన ప్రాంతాల్లో నూరు శాతం పారిశుధ్య పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. శానిటరీ సూపర్వైజర్లు ఇన్స్పెక్టర్లు, కార్యదర్శుల పనితీరు, హాజరుని క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని, ఇప్పటికే ఇతర విధుల్లో ఉన్న కార్మికులను తిరిగి పారిశుధ్య పనులకు కేటాయించామని, డివిజన్ల పరిధి తగ్గించినందున ప్రతి ఒక్కరూ అంకిత భావంతో విధులు నిర్వహించాలని, నిర్లక్ష్యంగా ఉండే వారి పై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Tags guntur
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …