Breaking News

 నాబార్డ్ ఆధ్వర్యంలో రొయ్యల రంగానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం

– ప్రగతి పథకం అమలు కార్యక్రమం ద్వారా ప్రగతి లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నాం
– చిన్న, మధ్య, భారీ ఆక్వా పెంపకం ద్వారా ప్రోత్సహం అందించే ప్రయత్నం చేస్తున్నాం
– దేశీయ రొయ్యల ఉత్పత్తి లో ఇక్కడి నుంచి 70 శాతం ఇక్కడే నుంచి రావడం జరుగుతోంది
– నాబార్డ్ సి జి ఎం ఎం. ఆర్ గోపాల్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
చేపలు, రొయ్యల సాగు చేస్తున్న రైతులకు నాబార్డ్ కొండంత ఆసరాగా నిలుస్తు, ఆక్వా రంగం అభివృద్ధికి రొయ్యల రంగానికి ఆర్థిక సహాయాన్ని అందించడంలో నాబార్డ్  ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని
నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక లాహాస్పిన్ హోటల్ సమావేశమందిరంలో రాష్ట్ర మత్స్య శాఖ సహకారంతో నాబార్డు అధ్వర్యంలో   రొయ్యల పెంపకంపై ఉభయ గోదావరీ జిల్లాల వారి రైతులతోనిర్వహించిన ప్రాంతీయ అవగాహన సదస్సుకు నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో నాబార్డ్ సి జి ఎం(హెచ్. ఓ)డా. ఏ.వి. భవాని శంకర్,
మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ లాల్ మహమ్మద్, ఏజిఎం ఎస్ఎల్.బిసి శ్రీనివాస దాస్యం, ఎన్ఎఫ్డిబి డా. ఏవి మాధురి,
ICAR-CMFRI ప్రిన్సిపల్ సైంటిస్ట్
డా. జో కె. కిజాకుడన్, ఎంపిఈడిఏ
జాయింట్ డైరెక్టర్, విజయకుమార్ యరగల్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ
రొయ్యల రంగానికి ఆర్థిక సహాయాన్ని అందించడంలో నాబార్డ్  ముఖ్యమైన పాత్రను పోసిస్తుందన్నారు. భారతదేశంలో రొయ్యల పెంపకం, ప్రాసెసింగ్ మరియు ఎగుమతి యొక్క భవిష్యత్తును వ్యూహరచన చేయడంపై దృష్టి సారించిందన్నారు. రొయ్యల ఉత్పత్తి మరియు ఎగుమతులను పెంపొందించడానికి సహకార ప్రయత్నాల ప్రాముఖ్యతను వివరించారు. రొయ్యల సంతానోత్పత్తి కోసం న్యూక్లియస్ బ్రీడింగ్ కేంద్రాల స్థాపనకు ఆర్థిక సహాయం అవసరమన్నారు. ఆక్వాకల్చర్ & ఫిషరీస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా రొయ్యల పరిశ్రమలో కీలక పాత్రను పోషిస్తున్న వహిస్తుందాన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మత్స్య, ఆక్వా రంగం ద్వారా 70 శాతం ఉత్పత్తి ఉందన్నారు. ఆక్వా రంగంలో అభివృద్ధిపై మొదటి విడత కార్యక్రమాన్ని ఆగస్టు 9 విజయవాడలో నిర్వహించడం జరిగిందన్నారు. 974 కి . మీ . విస్తారమైన తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ ఎక్స్ పోర్ట్స్ లో రికార్డు స్థాయి వృద్ధి నమోదవుతోందన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి చైనా, యూఎస్ఏకు నాణ్యతతో కూడిన ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆక్వా రంగం ప్రగతి లక్ష్యంలో భాగంగా సన్న, మధ్య కార్పోరేట్ స్థాయి రైతులు అభివృద్ధికి నాబార్డు రుణ సౌకర్యాన్ని కల్పిస్తూ సహకరిస్తుందన్నారు . ప్రతి కుటుంబం నుంచి వ్యాపారవేత్తలు తయారు అయ్యి ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర 2047 ప్రారంభించారన్నారు. క్వాలిటీ గల మంచి సీడ్ ను వలన ఉత్పత్తి బాగుంటుందన్నారు.
రాష్ట్రియంగా ఆక్వా, మత్స్య సంపద సృష్టి రాష్ట్ర జిడిపి వృద్ధి లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవగాహన సదస్సు ఆక్వా సాగులో రైతులకు ఎంతో ఉపయోగకంగా ఉంటుందని పేర్కొన్నారు.

నాబార్డ్ సి జి ఎం(హెచ్. ఓ)డా. ఏ.వి. భవాని శంకర్ మాట్లాడుతూ ప్రపంచంలో భారత్ దేశం ఉత్పత్తుల్లో రెండో స్థానంలో ఉందన్నారు. గత ఏడు సంవత్సరాలుగా వ్యవసాయ అనుబంధ రంగాలతో పోలిస్తే మత్స్య ఉత్పత్తుల విభాగానికి సంబంధించి ఏడు శాతం అభివృద్ధిలో ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రొయ్యల ఎగుమతిలో రెండవ స్థానంలో ఉందగా, ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందన్నారు.
రొయ్యల పెంపకం వలన వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఏర్పాడ్డాయన్నారు.
ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఆక్వారంగాన్ని అభివృద్ధి పరచటం తో పాటు సమస్యలను అధికమించేందుకు భారత ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహాలను అందిస్తుంది అన్నారు. ఇప్పటివరకు మనం సీడ్స్ ను బయట నుంచి తీస్తున్నామన్నారు. భారత ప్రభుత్వం ఈ రంగానికి సంబంధించి నిధులు కేటాయింపులో రు. 2600 కోట్లు(54%)తో టిఎంఎంఎస్ వై క్రింద మంజూరు చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మత్స్య పరిశ్రమ అభివృద్ధి దిశగా దిగుమతి పై వున్న సుంకం 15 నుంచి ఐదు శాతానికి తగ్గించడం జరిగిందన్నారు. బ్యాంకర్స్ నాబార్డ్ ద్వారా సీడ్, ప్రాసెసింగ్, ఎగుమతులకు సంబంధించి రుణ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిధులను ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక ఆక్వారంగాన్ని మరింత అభివృద్ధి చెందే దిశగా తీసుకువెళ్లాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, ఎగుమతుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడిందన్నారు. రొయ్యల పెంపకం పద్ధతుల కోసం నిబంధనలు మరియుప్రభుత్వం స్థిరమైన
మార్గదర్శకాలను ప్రవేశపెట్టిందన్నారు.

ఎస్ ఎల్ బి సి ఏజీఎం శ్రీనివాస దాస్యం మాట్లాడుతూ మత్స్య,ఆక్వా రంగాల అభివృద్ధికి ఆయా రంగాల్లో పనిచేస్తున్న రైతులు ఇతర యూనిట్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ లాల్ మొహమ్మద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యల రంగాన్ని దీర్ఘకాలికంగా విజయవంతం చేసేందుకు ప్రభుత్వం, రైతులు మరియు ఆర్థిక సంస్థల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. మత్స్య ఆక్వా రంగా అభివృద్ధికి, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలు నిర్ణయాలు తీసుకుంటారన్నారు. ఆక్వా రైతులకు సంబంధించి వడ్డీ రాజకీయ అంశంలో ఒకే సంవత్సరానికి ఒకే విధానాన్ని అమలు చేయాలన్నారు. తూర్పు వెస్ట్ గోదావరి, కృష్ణ గుంటూరు జిల్లాలలో 70 శాతం ప్రాంతం ఆక్వా కల్చర్ సాగులో ఉందన్నారు. ఆక్వారంగానికి 54034 మంది రైతులకు విద్యుత్తు రాయితీలు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా రు.950 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగిందన్నారు. వ్యవసాయ రంగంలో మాదిరిగానే ఆక్వా రంగంలో కూడా అవును రైతులకు రుణ సహాయాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఆక్వాకల్చర్ లో డ్రోన్ వినియోగం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రొయ్యలతోపాటు పీతలు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. రు.200 కోట్ల రూపాయలతో ఆక్వా పార్కును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. భారతదేశంలో రొయ్యల పెంపకం ఒక ముఖ్యమైన పరిశ్రమ, ప్రపంచంలోని అతిపెద్ద రొయ్యల ఉత్పత్తిదారుల్లో దేశం ఒకటి అన్నారు.

ICAR-CMFRI ప్రిన్సిపల్ సైంటిస్ట్
డా. జో కె. కిజాకుడన్, ఎంపిఈడిఏ
జాయింట్ డైరెక్టర్, విజయకుమార్ యరగల్ సదస్సులో ఆక్వా రంగు అభివృద్ధి పై పలు అంశాలను వివరించారు.

ఈ సందర్భంగా రైతులు, ప్రాసెసర్‌లు, ఎగుమతిదారులు,  టెక్నాలజీ  సంస్థల ప్రతినిధులకు పలు అంశాలపై సందేహాలను నివృత్తి చేశారు.

ఈ అవగాహన సదస్సులో
ICAR-CMFRI ప్రిన్సిపల్ సైంటిస్ట్
డా. జో కె. కిజాకుడన్, ఎంపిఈడిఏ
జాయింట్ డైరెక్టర్, విజయకుమార్ యరగల్
నాబార్డ్ ఏజీఎం వై ఎస్.నాయుడు, లీడ్ బ్యాంకు మేనేజర్ డివి ప్రసాద్, ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ కృష్ణారావు, బ్యాంకర్లు, రైతులు, ప్రాసెసర్‌లు, ఎగుమతిదారులు,  రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మరియు టెక్నాలజీ  సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *