-స్నేహకు మద్దతుగా బీజేపీ సీనియర్ నాయకులు బబ్బురి భూపాల్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఇంటింటా ప్రచారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
33 వ డివిజన్ లో ఎన్డీయే కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి చేరుబు కొమ్ము స్నేహ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు బబ్బూరి భూపాల్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నారు. 33 వ డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని టీడీపీ అభ్యర్థి చేరుబు కొమ్మూ స్నేహ కు సైకిల్ గుర్తుపై, మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు అభ్యర్థించారు.
