Breaking News

రూ.15.20 కోట్ల వ్యయంతో గ్రామ, వార్డు సచివాలయాలను నిర్మిస్తున్నాం… : మంత్రి కొడాలి నాని


-మరో రూ.8.27 కోట్లతో రైతు భరోసా కేంద్రాలు
-రూ.4 కోట్లతో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు
-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రూ.15.20 కోట్ల వ్యయంతో కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో గ్రామ, వార్డు సచివాలయ భవనాలను నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడలో నియోజకవర్గంలో జరుగుతున్న గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ల నిర్మాణ పనులపై అధికారులతో మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం జగన్మోహనరెడ్డి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని చెప్పారు. అవినీతి, వివక్షతకు తావులేని విధంగా పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారన్నారు. పెన్షన్లు, బియ్యం కార్డులు, ఇళ్ళపట్టాలు, తాగునీటి సమస్యలు, వైద్యం, ఆరోగ్యం, రెవెన్యూ, శిశు సంక్షేమం, పౌల్ట్రీ తదితర సేవల కోసం గ్రామ , వార్డు సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే ఆయా సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ వ్యవస్థ ఏర్పడి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సచివాలయ పరిధిలోనే ఉద్యోగులు నివాసం ఉండేలా కొత్త నిబంధనలు తీసుకువచ్చారన్నారు. ఉద్యోగుల చిరునామా ఆయా సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే గుడివాడ నియోజకవర్గంలో రూ.8.27 కోట్ల వ్యయంతో రైతుభరోసా కేంద్రాలను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 1,898 రైతుభరోసా కేంద్రాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయన్నారు. మరో 10 వేల కేంద్రాలు వచ్చే నాలుగు నెలల్లో పూర్తికానున్నాయని చెప్పారు. గుడివాడ నియోజకవర్గంలో ఒకటి, రెండు నెలల్లో రైతుభరోసా కేంద్రాల నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. ఈ కేంద్రాల ద్వారా విత్తనం మొదలు పంట అమ్మకం వరకు రైతులకు అవసరమైన అన్నిరకాల సూచనలు, సలహాలు ఇస్తారన్నారు. పంట రుణాలు, ఇన్సూరెన్స్, గిట్టుబాటు ధర కల్పించేలా ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయని చెప్పారు. రైతులకు పెట్టుబడి ఖర్చును తగ్గించి, సాగును లాభసాటి చేయడమే ఈ రైతుభరోసా కేంద్రాల లక్ష్యమని తెలిపారు. ఇదిలా ఉండగా రూ. 4 కోట్ల వ్యయంతో గుడివాడ నియోజకవర్గంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రతి 2 వేల జనాభాను ఒక యూనిట్ గా తీసుకుని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా విలేజ్ క్లినిక్ లను నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఈ క్లినిక్ లో బీఎస్సీ నర్సింగ్ చదివిన స్టాఫ్ అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రతి రోగికి ఇక్కడ ఉచితంగా ప్రాధమిక వైద్యం అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13 వేల విలేజ్ క్లినిక్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. గ్రామస్థాయిలోనూ వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి కొడాలి నాని తెలిపారు.

Check Also

మునిసిపల్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

-పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, వేస్ట్ మేనేజ్మెంట్, టౌన్ ప్లానింగ్, టిడ్కో ప్రాజెక్ట్ లపై చర్చ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *