Breaking News

కోవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రధాన మార్గం…

-ఫీవర్ సర్వేను పక్కాగా నిర్వహించాలి…
-సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలి…
-మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా వైరస్ నుండి రక్షణకు వ్యాక్సినే మార్గమని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకొని సుక్షితంగా ఉండాలని మున్సిపల్ కమీషనర్ పీజే సంపత్ కుమార్ అన్నారు. మెగా వ్యాక్సినేషన్ లో డ్రైవ్ లో భాగంగా సోమవారం గుడివాడ పట్టణంలోని 5,6,7 సచివాలయాలను కమీషనర్ సంపత్ కుమార్ సందర్శించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో అన్ని సచివాలయాల్లో కోవీషీల్డు, కోవాక్సిన్ వ్యాక్సిన్ ప్రజలకు అందిస్తున్నామన్నారు. మఖ్యంగా 45 సంత్సరాల వయస్సు నిండిన వారికి కోవీషీల్టు మొదటి రెండన విడతలు అందిస్తున్నామని కోవాక్సిన్ వ్యాక్సిన్ మాత్రమం సెకండ్ డోస్ మాత్రమే వేయడం జరగుతుందన్నారు. 5 సంవత్సరాలు పిల్లల తల్లులకు, గర్భిణీ స్త్రీలకు, 18 సంవత్సరాలు వయస్సు పైబడిన టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు వ్యాక్సిన వేస్తునట్లు తెలిపారు. కోవీషీల్డు,3 వేలు కోవాగ్జిన్ 5 వందలు డోసులు గుడివాడ పట్టణంలో సచివాలయాలు ద్వారా అందిస్తున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వార్దు సచివాలయాలను తనికీ చేసిన మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్. గుడివాడ పట్టణంలో ని 5, 6, 7 సచివాలయాలను ఆకస్మిక తనికీ చేసి సచివాలయ సిబ్బంది ఉద్యోగులు వారికి కేటాయించిన విధులు సక్రమంగా నిర్వర్తించడం పట్ల కమీషనర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతి శాఖపరమైన పర్సన్ అసిస్టెంట్లు నిర్వహిస్తున్న రికార్డులు, హాజరు పట్టీ, మూమెంట్ రిజష్టరు పరిశీలించామన్నారు. ప్రతి సచివాలయంలో ప్రభత్వ పథకాలు తెలిపే బోర్డులు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారమన్నారు. కోవిడ్ కట్టడిలో భాగంగా పట్టణంలో ప్రతి వారం వాలెంటర్లు పక్కాగా ఫీపర్ సర్వేను చేపట్టి నమోదు చెయ్యాలన్నారు. ఇంటింటికీ వాలెంటరీ, ఆశా వర్కులు వెళ్లి పరిశీలించెటప్పుడు కోవిడ్ లక్షణాలు లేకపోతే నిర్ణీత ఫారమ్ లో నిల్ గా చూపిస్తూ రిపోర్టు లో నమోదు చెయ్యాలన్నారు. సర్వేకు వెళ్లకుండా సమాచారం తప్పుగా ఇస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించడం వలన కోవిడ్ నియంత్రణ సాధ్యమవుతుందని ప్రజల కూడా సర్వే టీమ్ లకు సహకరించాలని సమీషనర్ సంపత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Check Also

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *