ప్రజా సమస్యలపై స్పందనలో వచ్చిన అర్జీలను నిర్థేశించిన గడువులోపే పరిష్కరించాలి…


-మెగా వ్యాక్సినేషన్ లో భాగంగా కోవిడ్ కట్టడికి డివిజన్లో 22 వేల వ్యాక్సిన్లును ప్రజలకు వేస్తున్నాం…
-ఆర్డీవో శ్రీనుకుమార్

గుడివాడ,  నేటి పత్రిక ప్రజావార్త :
సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు స్పందన కార్యక్రమంలో దరఖాస్తు చేసిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఆర్డీవో జి.శ్రీనుకుమార్ అధికారులను అదేశించారు.
స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్ఫందన కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో గల ప్రజలు తమ సమస్యలపై స్పందనలో ఇచ్చిన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించి అర్జీదారునికి పరిష్కార పత్రాన్ని అందజేయాలని అధికారులకు సూచించారు. తమ పరిధిలో లేని ధరఖాస్తులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. శాఖల వారీ అధికారులు తమ కార్యాలయానికి వచ్చిన అర్జీలను సక్రమంగా తేదీల వారీ వరస క్రమంలో రిజిష్టరు లో నమోదు చేసి అర్జీదారునికి ఆన్ లైన్ రశీదును అందజేయాలన్నారు.
గుడివాడ డివిజన్ లో 22 వేల వ్యాక్సినేషన్లు సచివాలయాలు, పీహెచ్సీలు ద్వారా అందిస్తున్నాం.. ఆర్డీవో శ్రీనుకుమార్
మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా డివిజన్ కు 22 వేల వ్యాక్సిన్లు అందయాన్నారు. సోమవారం వాటిని డివిజన్ పరిధిలో గల తొమ్మిది మండలాల్లో గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ద్వారా ప్రజలకు వ్యాక్సిన్ వేయనున్నారని తెలిపారు. కోవిడ్ కట్టడికి సహకరిస్తూ ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ తప్పని సరిగా వేయించుకోవాలని, అదేవిధంగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం, శానిటైజర్లు వినియోగించడం వంటి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనా వైరస్ కు దూరంగా ఉండాలని ఆర్డీవో శ్రీనుకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అర్జీలు…
గుడివాడ మండలం బిళ్లపాడు గ్రామానికి చెందిన రావులకొల్లు దుర్గారావు తమ అర్జీలో బిళ్లపాడు నాయి బ్రాహ్మణ్ కాలనీలో డ్రైనేజీ సౌకర్యం లేక చిన్నపాటి వర్షపు నీటికే రోడ్డు తద్వారా జలమయమవుతుందని, దీనివల మురగునీరు ఏర్పడటం తద్వారా దుర్వాశన వస్తూ దోమల బెడద ఎక్కువుగా ఉంటుందన్నారు. కాలనీలోని ప్రజలకు డెంగీ వంటి జ్వరాలు కూడా వస్తున్నాయని అధికారులు కాలనీలో డ్రైనేజీ సౌకర్యం కల్పించారని కోరారు.
గుడివాడ పట్టణానికి చెందిన కైకాల దుర్గాభవాని తమ అర్జీలో వివరిస్తూ మీము పాటిమీద నివశిస్తున్నామని, మా పై పోర్షన్ లో ఉండే బాలకృష్ణ వాడే నీరు మా గుమ్మంముందు నిలుస్తుందని, డ్రైనేజీ కట్టించమనగా ఏ మాత్రం స్పందించడంలేదని కావున అధికారులు మాకు న్యాయం చెయ్యాలని కోరారు.
గుడివాడ 9 వ వార్డు నివాసి కె. శాంతికుమారి తమ అర్జీలో ఇల్లస్థలాన్ని మంజూరు చెయ్యలవసినందిగా కోరియున్నారు.
కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయపు పరిపాలనాధికారి స్వామినాయుడు, డీటీ బాలాజీ, డిప్యూటీ డీఇవో, కమలకుమారి, బీసీ వెల్పేర్ అధికారి, ఇరిగేషన్, వ్యవసాయ, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *