విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్‌లో కూటమి నాయకులతో ఎంపీ కేశినేని చిన్ని భేటీ

-డివిజన్‌లో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని సూచన
-మేయర్, కార్పొరేటర్ అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్‌లో కూటమి నాయకులతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సమావేశమయ్యారు. 13వ డివిజన్‌లోని సంయుక్త వేదిక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, 13వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి దేవినేని నాగమహిత, 14వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సహేరా భానుతో కలిసి ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 13వ డివిజన్‌లో నెలకొన్న డ్రైనేజీ సమస్యలపై ఎంపీ కేశినేని చిన్ని ప్రత్యేకంగా చర్చించారు. డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని కార్పొరేటర్ అభ్యర్థి దేవినేని నాగమహితకు సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

డివిజన్ ప్రజలకు అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఎంపీ కేశినేని చిన్ని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని కూటమి నాయకులకు సూచించారు.

అనంతరం ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, 13, 14వ డివిజన్లలో కూటమి నాయకులు, కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమష్టి కృషి చేయాలని సూచించారు.

మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో పాటు డివిజన్లలో పోటీ చేస్తున్న కూటమి కార్పొరేటర్ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని ఎంపీ కేశినేని చిన్ని కోరారు. ప్రజల మద్దతుతో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో దేవినేని చందు, దేవినేని అపర్ణ, రామాయణపు సాంబయ్య, సుజాత, రామాయణపు కోటి, కోనేరు రాజేష్ మరియు కూటమినేతలు పాల్గొన్నారు..