ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్రిగోల్డ్ లో డిపాజిట్ చేసిన సొమ్మును ఇచ్చిన మాటకు కట్టుబడి నేరుగా భాదితుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచెయ్యడం పట్ల జిల్లాలో పలువురు లబ్ధిదారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. 2019 నవంబర్ నెలలో రూ.10 వేలు లోపు డిపాజిట్ చేసిన వారికి జమచెయ్యడం జరిగింది. ఇప్పుడు అగ్రిగోల్డ్ బాధితులు, ప్రత్యేకించి రూ .20,000 కంటే తక్కువ డిపాజిట్లు చెల్లించిన చిన్న పెట్టుబడిదారులు, రాష్ట్ర ప్రభుత్వం రెండవ దశలో డిపాజిట్ల తిరిగి చెల్లింపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నావారికి తగిన న్యాయం చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెండవ దఫా లో 10 వేల పైబడి సుమారు 38 వేలమంది అగ్రిగోల్డ్ భాదితులకు/ డిపాజిట్ దారుల బ్యాంకు ఖాతాలకు రూ.35.48 కోట్లు చెల్లింపు జరపడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.10 వేల లోపు డిపాసిట్ చేసిన 35,496 మంది భాదితులకు రూ.23 కోట్ల ను తొలిసారి 2019 నవంబర్ లో వారి ఖాతాలో జమ చెయ్యడం జరిగింది.
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మొత్తం ఆర్ధిక వ్యవస్థ కుదేలైనా ఇప్పుడు రెండోవ విడతగా మరోసారి ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.35 కోట్ల 48 లక్షలు చెల్లింపు చెయ్యడం జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులకు పాదయాత్ర లో ఇచ్చిన మాట కు కట్టుబడి చెల్లింపులు సర్వదా హర్షణీయం. ఆర్థికంగా పొదుపు చేసి ఆర్ధిక ప్రయోజనం కోసం పేదలు, మధ్య తరగతి వర్గాల వారు అధిక సంఖ్యలో అగ్రిగోల్డ్ నందు పొదుపు చేసుకోవడానికి ముందుకు వొచ్చారు. పాదయాత్ర చేస్తూ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని ఇచ్చిన హామీ, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా హామీలు అమలు చేయడం లో ముఖ్యమంత్రికి ఎవరు సాటిరారని పెదవేగికి చెందిన రైతు టి.దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. గతంలో మా గ్రామంలో 10 వేలు కట్టిన వారికి జమచేసారని, తనకు రూ.14500 జమ అయిందని తెలిపారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆ కంపెనీలో డిపాజీట్ చేసిన వారు పూర్తి గా నష్టపోయామని, ఇంక రావన్న నిరాశతో ఉన్న మాకు , ఇప్పుడు దశల వారీగా భాదితులకు వారు కట్టిన మొత్తాన్ని జమచేసినందుకు ఏపురు కి చెందిన డి.ఉమా మహేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు.
వట్లూరు కి చెందిన ఎస్.రామస్వామి మాట్లాడుతూ, అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా పనిచేస్తూ లాండ్రీ కూడా చేస్తున్నానని, కొద్దిపాటి ఆదాయాన్ని అగ్రిగోల్డ్ లో 7 సంవత్సరాలు క్రితం నేను, నా భార్య జమచేశామన్నారు. 2019 లో తన భార్య పేరున డిపాసిట్ చేసిన రూ.10 వేలు జమ చేశారన్నారు. తాను దాచుకున్న మొత్తం ఇప్పుడు జమచెయ్యడం ఎంతో ఆనందం ఇచ్చిందని అన్నారు. అధికారులు, గ్రామ వాలంటీర్లు ద్వారా తమ డిపాజిట్, వివరాలు సేకరించి చెల్లింపు చెయ్యడం పట్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ఏలూరులో మోటార్ సైకిల్ మెకానిక్ గా పనిచేసే బి.జగదీష్ కుటుంబం అగ్రిగోల్డ్ నందు 10 వేలు, 20 వేలు డిపాసిట్ చేశారన్నారు. గతంలో 10 వేలు ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఇప్పుడు మళ్లి కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించారన్నారు. మాదేపల్లి, గుండుగోలను లలో ఉన్న తన తోటి మెకానిక్ లకు వారు చెల్లించిన సొమ్ము తిరిగిరావడం జరిగిందన్నారు. తమకు, ముఖ్యంగా రోజు కూలీలుగా పనిచేస్తున్న వారికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో న్యాయం జరగడం పట్ల కృతజ్ఞత వ్యక్తం చేశారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలులో రాష్ట్ర ప్రభుత్వం తనదైన ముద్ర వేసింది.