Breaking News

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం ప్రతిపాదనలను సిద్ధం చేయాలి… : ఎమ్మెల్యే ఆర్కే

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి MTMC కార్యాలయంలో  మంగళవారం  అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయటానికి  అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆర్కే సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను గతంలో మోడల్ మున్సిపాలిటీలు గా మార్చటానికి దాదాపు 1200 కోట్ల రూపాయల కేటాయించడం జరిగిందని కరోనా కారణంగా కొంత ఆలస్యం అయినదని ఇందులో భాగంగా ముందుగా పబ్లిక్ హెల్త్, UGD, రెవెన్యూ, MTMC అధికారులతో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని అనుకుని ముందుగా కన్సల్టెన్సీ వారు సిద్ధం చేసిన ప్రతిపాదనలను పరిశీలించడం జరిగిందని, దాదాపు 300 కోట్ల రూపాయలతో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. కన్సల్టెన్సీ వారు 30 వేల ఇళ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసినారు దాదాపు MTMC పరిధిలో 50 వేల ఇళ్ళు వున్నాయని మరలా ఒక వారం రోజులలో 50 వేల ఇళ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు, దాదాపు 13 పంపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వారి మెఇంటనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉంటుందని వీలైనంత వరకు వాటికి తగ్గించాలని అన్నారు. పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వ, రెవిన్యూ, R&B, ఇరిగేషన్ స్థలాలను గుర్తించాలని, కుదరకపోతే ల్యాండ్ ప్రైవేట్ స్థలాలను కొనుగోలు చేయాలని అన్నారు. MLD ప్లాంట్లను రెండుగా ఏర్పాటు చేయాలని, తద్వారా తాడేపల్లి మహానాడు కట్ట వద్ద నుండి మంగళగిరి రత్నాల చెరువు వరకు MLD పంప్ చేయటం తగ్గుతుందని అన్నారు. మంగళగిరి రత్నాల చెరువు వద్ద ఒక 25 MLD ప్లాంటును, తాడేపల్లి లో 25 MLD ప్లాంటును ఏర్పాటు చేయాలని అన్నారు. అధికారులు ఈ పనులను ఈ రోజు నుండే ప్రారంభించి ఒక వారం రోజులలో పూర్తి చేస్తే, అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్ శ్యాంక్షన్ పూర్తి చేసుకుని త్వరలోనే టెండర్లకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. కార్పొరేషన్ అయిన తరువాత మంగళగిరి, తాడేపల్లి మండలాల గ్రామాలకు కూడా UGD క్రింద ఆయా గ్రామాలకు కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ వర్తించేలా ప్రతిపాదనలను సిద్ధం చేయమని అధికారులను ఎమ్మెల్యే ఆర్కే కోరారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *