విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలోని ఎస్.ఆర్.ఆర్. ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి. విజయకుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న తీరును, ఎన్నికల విధుల నిర్వహణను పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణ, ఎన్నికల నియమావళి అమలు తీరును సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా అధికారులకు తగిన సూచనలు చేశారు.
పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల నిర్వహణను పరిశీలించిన జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి. విజయ్ కుమార్
