పట్టణ స్థానిక సంస్థల పోలింగ్ సరళిపై జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ నిరంతర పర్యవేక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లా కలెక్టరేట్‌లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో ఏర్పాటు చేసిన సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ నిరంతరం పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న తీరు, ఓటర్ల రాక, పోలింగ్ శాతం, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా సాగేందుకు సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎక్కడైనా సమస్యలు లేదా ఇబ్బందులు తలెత్తితే తక్షణమే స్పందించి పరిష్కరించేలా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో సమన్వయం, నిరంతర పర్యవేక్షణతో పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు చేపడుతున్నారు.