-డాక్టర్ మాకాల సత్యనారాయణ ఆధ్వర్యంలో డ్రగ్లెస్ వరల్డ్ హెల్త్ సెంటర్ సేవలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రస్తుత జీవనశైలిలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలకు ప్రత్యామ్నాయ వైద్య విధానాల ద్వారా అవగాహన కల్పిస్తూ, ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా విజయవాడలోని డ్రగ్లెస్ వరల్డ్ హెల్త్ సెంటర్ పనిచేస్తోందని సంస్థ వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. యోగ, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, ప్రాణశక్తి చికిత్స, ధ్యానం, ప్రాణాయామం, పంచకర్మ, ఆహార నియమాలు తదితర విధానాలపై శిక్షణ, చికిత్స, పరిశోధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి, మెడ నొప్పి, మైగ్రేన్, సైనసైటిస్ తదితర సమస్యలకు సంబంధించి ఆక్యుపంక్చర్, యోగా ఆధారిత చికిత్సా విధానాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.
ఇందులో భాగంగా ఆక్యుపంక్చర్ ప్రాథమిక శిక్షణ, ఆహారం–ప్రాణశక్తి శిక్షణ, కుటుంబ ఆరోగ్య చికిత్సలు, ప్రథమ చికిత్స అవగాహన, చికిత్సకుల శిక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగా శక్తి సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా, ఇండియన్ ఓమ్ హోలిస్టిక్ హెల్త్ కేర్ పరిశోధన అధికారిగా కూడా డాక్టర్ మాకాల సత్యనారాయణ సేవలందిస్తున్నారు. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెంపొందించడంతో పాటు ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై శిక్షణ అందించేందుకు సంస్థ కృషి చేస్తోందని పేర్కొన్నారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 9000347369, 8985372009.
చిరునామా: ఇండియన్ ఓమ్, అశోక్‌నగర్, కానూరు, విజయవాడ గ్రామీణ ప్రాంతం.
