విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ వార్డుల యందు సుమారు 203 మంది వార్డ్ వాలంటీర్ల ఎంపిక కొరకు అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకుల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోనవచ్చునని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఈ ప్రకటన ద్వారా తెలియజేసారు. వార్డ్ వాలంటీర్ల కొరకు ధరఖాస్తు చేసుకొను వారు 10 వతరగతి (SSC) ఉతీర్ణులై ఉండవలెనని, 01-01-2021 నాటికి 18 సంవత్సరములు నిండి, 35 సంవత్సరములు లోపు గలవారై నగరపరిధిలో నివసించు అభ్యర్థులు మాత్రమే అర్హులు ఆసక్తి గల నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అర్జిదారులు పూర్తి విద్యా అర్హతల మరియు ఇతర ధృవీకరణ పత్రములను జతపరచి https://gramawardsachivalayam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా 23.09.2021 తేది లోపుగా ధరఖాస్తు చేసుకొనవలెనని, దీనికి సంబందించి 28.09.2021 & 29.09.2021 తేదిలలో మౌఖిక పరీక్షలు నిర్వహింప బడునని తెలియజేసారు. ఇతర వివరాల కొరకు స్పెషల్ ఆఫీసర్ (వార్డ్ సెక్రటేరియట్స్) లేదా వార్డు సెక్రటేరియట్ స్పెషల్ సెల్ నెంబర్ 8185933187 కు సంప్రదించాలని పేర్కొన్నారు.
Tags vijayawada
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …