విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులందరూ సాముహికంగా ఒకేసారి ఎలుకల మందును ఉపయోగించి పంటను ఎలుకల నుండి కాపాడుకోవడం ద్వారా పంట దిగుబడిని పెంచుకోవచ్చని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. మంగళవారం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సాముహిక ఎలుకల నివారణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు మరియు పాంపులేట్లను జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత (రెవిన్యూ), విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చండీతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరి ఎక్కువుగా సాగవుతుందని, వరి పైరులో నారుమడిపోసిన దగ్గర నుంచి గింజదశ వరకు అన్ని దశలలోను ఎలుకలు పైరుకు నష్టం కలిగిస్తాయని, ఎలుకల నివారణకు ఇదే సరైన సమయం అని, ఈ సమయంలో ఎలుకలకు ఆహారం లభ్యం కాకపోవడం వల్ల ఎరగా పెట్టిన ముందును తిని ఎలుకలు చనిపోతాయని తద్వారా ఎలుకల వల్ల కలిగే అధిక ఆర్ధిక నష్టాన్ని తగ్గించుకోవచ్చని, దీనికి ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా 100 శాతం రాయితీపై రైతులకు బోమోడయలిన్ ఎలుకల మందును ప్రతి రైతు భరోసా కేంద్రాల వద్ద సరఫరా చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంయుక్త సంచాలకులు టి. మోహనరావు , నూజివీడు ఆర్ డివో శ్రీమతి రాజ్యలక్ష్మీ, వ్యవసాయ సహాయ సంచాలకులు అనితా భాను, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …