-ఆర్యవైశ్య కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ గా డూండీ ప్రమాణ స్వీకారం
-ఎంపి కేశినేని శివనాథ్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన డూండీ
-డూండీకి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం బాగుండాలంటే వ్యాపారస్తులు బాగుండాలి. వ్యాపారస్తుల్లో ఎక్కువగా ఆర్యవైశ్యులే వున్నారు. వారి సంక్షేమం కోసం, అభివృద్ది కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం లోని గాంధీ మున్సిపల్ హైస్కూల్ లో ఆదివారం ఆర్యవైశ్య కార్పొరేషన్ డెవలప్మెంట్ ఛైర్మన్ డూండీ రాకేష్ పదవీ బాధ్యత ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపి కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ గా డూండీ తో పాటు కార్పొరేషన్ డైరెక్టర్ గా ప్రమాణాస్వీకారం చేసిన ఏచూరి రాముకి ఎంపి కేశినేని శివనాథ్ అభినందనలు తెలిపారు. ఆర్యవైశ్య చైర్మన్ గా డూండీ ప్రమాణా స్వీకారం చేసిన అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా మద్దతు ప్రకటించారన్నారు. ఈవిషయాన్ని ఎన్నికలకి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సభల్లో చెప్పారన్న విషయం గుర్తు చేశారు. ఆర్య వైశ్య సామాజిక వర్గం సామాజిక సేవ చేయటంలో ముందుంటారని కొనియాడారు. డూండీ రాకేష్ ప్రమాణా స్వీకారం కార్యక్రమం జాతిపిత గాంధీ మున్సిపల్ హైస్కూల్ జరగటం ఆనందంగా వుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులకి సమస్య అంటే డూండీ ముందు వుంటాడన్నారు. యువగళం సమయంలో మంత్రి నారాలోకేష్ కి డూండీ తోడుగా పాదయాత్ర చేయటమే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారస్తులు సమస్యలపై పొరాటం చేసి జగన్ ఆరాచక పాలనకు ధైర్యంగా ఉద్యమాలు చేశాడన్నారు. ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వ్యాపారస్తుల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిలో పార్కింగ్ సమస్య ఒకటి..ఆ సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తో చర్చించి ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పలు సమాజసేవ కార్యక్రమాలు చేపట్టే వాసవీ మహిళ క్లబ్ సభ్యులకి అభినందనలు తెలిపారు.
Prajavartha Online Telugu News