విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమలరావు ఐపీఎస్ కి ప్రముఖ పుణ్యక్షేత్రం కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా 428వ ఉరుసు మహోత్సవ ఆహ్వాన పత్రం అందజేశారు కమిటీ సభ్యులు. ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా మరియు మెమెంటో అందజేసి ఆహ్వాన పత్రం అందజేశారు కమిటీ సభ్యులు. షాబుఖారీ బాబా దర్గా 500 సంవత్సరాల పైగా పురాతన చరిత్ర మరియు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ఎంతో విశిష్టత కలిగిందని,జనవరి 9,10,11 తేదీలలో జరిగే ఉరుసు మహోత్సవానికి రాష్ట్రవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా లక్షలాదిగా భక్తులు హాజరవుతారని,వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం మూడు రోజులపాటు జరుగుతుందని ఉరుసు మహోత్సవ విశేషాలు ఆయనకు వివరించారు కమిటీ సభ్యులు. తప్పకుండా ఉరుసు మహోత్సవానికి హాజరైనందుకు ప్రయత్నం చేస్తానని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి భద్రత ఏర్పాట్లు చేసేందుకు పోలీస్ అధికారులకు సూచనలు చేస్తానని డిజిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉరుసు మహోత్సవ కమిటీ సభ్యులు ముక్తర్ అలీ, తబ్రేజ్ అలీ, మొహమ్మద్ అప్సర్, ఫైజాన్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News