ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు శాంతి భద్రతలు చేకూర్చడంలో మరింత శక్తి దైర్యం ప్రసాధించాలని అమ్మవారిని వేడుకొన్నట్లు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఇంద్రకీలాద్రి పై వేంచేసిన ఉన్న శ్రీకనకదుర్గమ్మ అమ్మవారు దుర్గాష్టమి పర్యదినాన్ని పురస్కరించుకుని దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని బుధవారం డిజిపి గౌతమ్ సవాంగ్ దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులకు పోలీశాఖ తరుపున దసరా శుభాకాంక్షలను తెలిపారు. అమ్మవారి కరుణాకటాక్షాలు అందరి పైన ఉండాలని కోరుకున్నానన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయని, ప్రజలు భక్తిభావంతో అమ్మవారిని దర్శించుకుంటున్నారన్నారు. ఉత్సవాలలో భక్తులకు పోలీస్ అధికారులు సేవలు అందిస్తూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నారన్నారు. ఇతర జిల్లాల నుండి కూడా పోలీస్ అధికారులు సిబ్బంది సేవాదృక్పదంతో సేవలందిస్తున్నారన్నారు. గురు,శుక్ర వారాల్లోని మహనవమి, విజయదశమి రోజుల్లో భక్తులు మరింత మంది అమ్మవారిని దర్శించుకోనున్నారని ఆయన అన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో డిపిజితో పాటు ఎడిషనల్ డిజిపి రవిశంకర్ అయ్యానార్ , నగర పోలీసు కమీషనర్ బి. శ్రీనివాసులు ఉన్నారు.
Tags indrakiladri
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …