-నవంబర్ 2న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
-రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో నిర్వహిస్తున్న రెండో సాధారణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా ఐదు జిల్లాల్లోని ఏడు పట్టణ స్థానిక సంస్థలకు చెందిన 12 వార్డుల్లోని 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.
రీపోలింగ్ నవంబర్ 2, 2026న (సోమవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
రీపోలింగ్ నిర్వహించనున్న వార్డుల, పోలింగ్ స్టేషన్ల వివరాలు:
1. అనంతపురం జిల్లా
అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ – 30వ వార్డు, పోలింగ్ స్టేషన్ నంబర్ 30/3.
2. తిరుపతి జిల్లా
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ – 36వ వార్డు, పోలింగ్ స్టేషన్ నంబర్ 36/4.
3. వైఎస్ఆర్ కడప జిల్లా
కడప మున్సిపల్ కార్పొరేషన్ – 15వ వార్డు, పోలింగ్ స్టేషన్ నంబర్ 15/2.
పులివెందుల – 1, 3, 7, 8వ వార్డులు, పోలింగ్ స్టేషన్ నంబర్లు 1/1, 3/1, 7/1, 8/1.
జమ్మలమడుగు – 3, 17, 29వ వార్డులు, పోలింగ్ స్టేషన్ నంబర్లు 3/2, 17/1, 29/1.
4. పల్నాడు జిల్లా
మాచర్ల – 23వ వార్డు, పోలింగ్ స్టేషన్ నంబర్లు 23/1, 23/2.
5. ప్రకాశం జిల్లా
చీమకుర్తి – 14వ వార్డు, పోలింగ్ స్టేషన్ నంబర్ 14/1.
మొత్తంగా ఐదు జిల్లాల్లోని ఏడు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 12 వార్డులకు చెందిన 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నారని కమిషనర్
అనిల్ చంద్ర పునేట తెలిపారు.
సంబంధిత ప్రాంతాల ఓటర్లు నిర్ణీత సమయానికి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ సూచించారు.
