Breaking News

వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ భవనాలను యుద్ధ ప్రాతిపదికపై సిద్దం చేయండి… : కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రూ. 22.40 కోట్లతో చేపట్టిన 28 వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలను యుద్ధప్రాతిపదిక పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాల ప్రగతి, విజయవాడ నగరంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ జె. నివాస్ వేర్వేరుగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కోక్క వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలకు రూ. 80 లక్షల చొప్పున మంజూరు చేయడం జరిగిందని జిల్లాలో 28 కొత్త అర్బన్ హెల్త్ క్లినిక్స్ మంజూరు చేశారన్నారు. వీటిలో 8 బెస్మెంట్, 3 రూట్లెవల్, మరో 5 ఆయా నిర్మాణ దశల్లో ఉన్నాయని వీటితో పాటు మిగిలిన అన్ని భవనాల నిర్మాణాలను ఎటి పరిస్థితులోను డిసెంబరు నాటికి పూర్తి చేసి అందుబాటులో ఉంచాలన్నారు. ఈ క్లినిక్లల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సదుపాయలు అందుబాటులోకి వస్తాయన్నారు. అదేవిధంగా మరి కొన్ని అర్బన్ హెల్త్ క్లినిక్ ల అభివృద్ధి పనులకు రూ.10 లక్షల చొప్పున మంజూరు చేయడం జరిగిందని ఆ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో సంబంధిత మున్సిపల్ కమీషనర్లు, పబ్లిక్ హెల్త్ ఇఇ, డియంహెచ్వో తదితరులు సమన్వయం చేసుకోవలన్నారు. వియంసి పరిధిలో 24 అర్బన్ హెల్త్ సెంటర్లగాను 7 చోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేశామని వియంసి సిఇ కలెక్టర్ కు వివరించారు.

అనంతరం విజయవాడ నగరంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎటువంటి పట్టు సడలకుండా టీకాలు వేసే కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలన్నారు. ఇంతవరకు వ్యాక్సినేషన్ పొందని వారిని గుర్తించి వారికి కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి డోసు తీసుకోవాల్సిన వారిలో 6,84,230 మంది ఉన్నారని వారిలో 18 నుంచి 44 సంవత్సరాలలోపు వారు 3,95, 110 మంది, 45 సంవత్సరాలు పైబడిన వారిలో 2,89,220 మంది ఉన్నారన్నారు.

ఈ టెలికాన్ఫరెన్స్ జాయింట్ కలెక్టర్(అభివృద్ధి, హెల్త్ ) ఎల్. శివశంకర్, వియంసి కమిషనర్ వి. ప్రసన్న వెంకటేష్, డియంహెచ్ డా. యం సుహాసిని, సియంఓ హెచ్ డా. గీతాబాయి పలువురు మున్సిపల్ కమిషనర్లు, స్పెషల్ ఆఫీసర్లు, శానిటరి ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *