Breaking News

యుకేలోని పలు నగరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  జన్మదిన వేడుకలు 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్‌లోని హౌన్స్లో (వెస్ట్ లండన్), ఈస్ట్ హామ్ (ఈస్ట్ లండన్), లూటన్, బెడ్‌ఫోర్డ్, బర్మింగ్‌హామ్, కోవెంట్రీ, మాంచెస్టర్, మిడిల్స్‌బ్రో, రగ్బీ, సట్టన్, బెల్ఫాస్ట్ నగరాల్లో నగర స్థాయి కమిటీల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు మహిళలు మరియు చిన్నారులు కూడా ఉత్సాహంగా పాల్గొని కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆయన నాయకత్వం మరింత బలోపేతం కావాలని నినాదాలు చేశారు. ఈ వేడుకలలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు జరిగాయి. భవిష్యత్తులో కూడా యుకేలోని తెలుగు సమాజం పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) జరిగే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *