అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్‌లోని హౌన్స్లో (వెస్ట్ లండన్), ఈస్ట్ హామ్ (ఈస్ట్ లండన్), లూటన్, బెడ్‌ఫోర్డ్, బర్మింగ్‌హామ్, కోవెంట్రీ, మాంచెస్టర్, మిడిల్స్‌బ్రో, రగ్బీ, సట్టన్, బెల్ఫాస్ట్ నగరాల్లో నగర స్థాయి కమిటీల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు మహిళలు మరియు చిన్నారులు కూడా ఉత్సాహంగా పాల్గొని కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆయన నాయకత్వం మరింత బలోపేతం కావాలని నినాదాలు చేశారు. ఈ వేడుకలలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు జరిగాయి. భవిష్యత్తులో కూడా యుకేలోని తెలుగు సమాజం పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News