Breaking News

గెడ్డం శ్రీను మరణం హత్యే అనే అభిప్రాయానికి కమిషన్ వొచ్చింది…

-రిటైర్డ్ ఏఎసైఐ ఎమ్.శ్యాం సుందర్ కేసు మాఫీ చేసేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది…
-ఛైర్మన్ ఎమ్. విక్టర్ ప్రసాద్

తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
గెడ్డం శ్రీను వంటి మరణాలు, ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే కమిషన్ కోరుకుంటోంద ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్. సి. కమి షన్ ఛైర్మన్ ఎమ్. విక్టర్ ప్రసాద్ పే ర్కొన్నారు.

గురువారం మలకపల్లి లో గెడ్డం శ్రీను మృతి పై ప్రజల నుంచి ఎస్సి కమిషన్ సభ్యులు చెల్లమ్ ఆనంద్ ప్రకాష్, బసవరాజులతో కలిసి ఆ యన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్. సి. కమిషన్ ఛైర్మన్ ఎమ్. విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు గానీ, సమాచారం కానీ, ఆధారాలు కానీమా ముందు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. గెడ్డం శ్రీను ను చంపి ఆత్మహత్య గా సృష్టించారని శ్రీను తల్లితండ్రులు బుల్లయ్య, వెంకయ్యమ్మ, పలువురు గ్రామస్థులు ఫిర్యాదు చేసారన్నారు. ఇక్కడికి వొచ్చి న్యాయం చెయ్యాలని కోరారన్నారు. గెడ్డం శ్రీను వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే కమిషన్ కోరుకుంటోందన్నారు. ఎంత సమయమైనా ఇక్కడే ఉండి వినతులు స్వీకరిస్తామన్నారు. హత్య అయితే దీని వెనుక ఉన్నది ఎవరు? వారి సంగతి తేల్చుకుందామని ఇక్కడికి వొచ్చాము. నేను న్యాయవాదిగా పనిచేశానని, ఎస్సి కమిషన్ సభ్యులు చెల్లమ్ ఆనంద్ ప్రకాష్ న్యాయవాది కాగా, మరో సభ్యులు బసవరాజు పోలీసు అధికారి అన్నారు. మాకు ఉద్యమాల మీద , చట్టాలపై అనుభవం ఉందని విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు.

ఎక్కడైనా శవం ఉంటే ముట్టుకోవొచ్చా, అటువంటి శవాన్ని ముట్టుకోవడానికి ఎవరికి అధికారం లేదని, ప్రజాప్రతినిధులైన, ఐ ఏ ఎస్ అయినా, ఏ అధికారి కైనా అధికారం లేదన్నారు. సంఘటన స్థలంలో బాడీ ని తిప్పడం జరిగిందని, ఒంటిపై గాయలున్నా నీళ్లతో కడగడం జరిగిందని, అలా కడగ వొచ్చా అని ప్రశ్నించారు. పోస్ట్ మార్టం నిర్వహించకుండా శవాన్ని తరలిస్తుండగా, తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేసిన వినకుండా దూషణ చెయ్యడం వాస్తవమే కదా అని అడిగారు. రిటైర్డ్ ఏఎస్ఐ మద్దుకురి శ్యాం సుందర్ కేసును మాఫీ చేయాలని ప్రయత్నం చేసారని, ఇది హత్యే అనే అభిప్రాయం కి ఎస్సి కమిషన్ వచ్చిందన్నారు.

గెడ్డం శ్రీను తల్లితండ్రులు నుంచి, శ్రీను మృతదేహాన్నీ మొదట, తరువాత చూసిన వారి నుంచి వివరాలు తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత గత 18, 19 రోజుల నుంచి స్పందించి అండగా నిలిచిన వారి నుంచి వినతులు స్వీకరించడం జరిగింది. అందరి అభిప్రాయాలను తెలుసుకుని, ముగ్గురం వాటిపై చర్చించి, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారులతో సమావేశం నిర్వహించి చట్టపరమైన చర్యలకు ఆదేశాలను ఇస్తామని ఆయన తెలిపారు.

ఎస్సి కమిషన్ సభ్యులు చెల్లమ్ ఆనంద్ ప్రకాష్, బసవరాజు లు మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితులకు ఎటువంటి అన్యాయం జరగకూడదన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయమన్నారు. అందుకే కమిషన్ కి ప్రత్యేక అధికారాలు ఇచ్చారని, ఎస్సి లలోని మాలలు, మాదిగలు, ఉప కులాలకు న్యాయం చేయడానికి ఎస్సి కమిషన్ పనిచేస్తుందన్నారు. కమిషన్ కి రాజకీయాలతో, పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. గెడ్డం శ్రీను మరణం దురదృష్ట కరమని, ఇటువంటి ఘటనలు జరగకుండా ఎస్సి కమిషన్ పనిచేస్తుందన్నారు. ఎస్సి లు ఐక్యంగా ఉండి కమిషన్ కి న్యాయ స్థానంలో నిలిచేలా వాస్తవాలు ఆధారాలు అందచెయ్యలన్నారు. సత్వర న్యాయం జరిగే వరకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అంతకుముందు మలకపల్లి చేరుకున్నఎస్సి కమిషన్ గెడ్డం శ్రీను ఇంటికి వెళ్ళి వారి తల్లిదండ్రులను పరామర్శించి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం గెడ్డం శ్రీను మృతదేహం లభ్యమైన ప్రాంతానికి చేరుకుని, జరిగిన సంఘటన వివరాలు తెలుసుకున్నారు. తదుపరి గ్రామసభ నిర్వహించి వివరాలని, వినతుల ను స్వీకరించారు.

ఈ పర్యటనలో ఎస్సి కమిషన్ వెంటఎస్. సి. కార్పొరేషన్ ఈ. డి, ఆర్. కుముదు ని సింగ్, ఆర్డీవో ఎస్. మల్లిబాబు, పోలవరం డిఎస్పీ కె.లతా కుమారి,బొంతా శ్యామ్, కోరుకొండ చిరంజీవి, పిట్టా శ్రీని వాస్, ముప్పిడి విజయరామ్,
ఎస్సి సంఘాల ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Check Also

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *