తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
పెద్దెవం గ్రామ అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శుక్రవారం పెద్దేవం గ్రామంలో ప్రమాదవశాత్తు నిన్న జరిగిన అగ్నిప్రమాదంలో 6 ఇల్లు పూర్తిగా కాలిపోయిన బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి నిరుపేద కుటుంబాల ఇళ్ళు అగ్ని ప్రమాదానికి గురి అయ్యాయన్నారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఆయా కుటుంబాలకు వంటసామగ్రిలను, దుప్పట్లను మరియు చీరలు పంపిణీ చేశారు. ఈ ఘటనలో ఇళ్ళు కోల్పోయిన భాదితులు నిరుపేద కుటుంబాలని, ప్రభుత్వం తరపున పక్కా ఇళ్లు మంజురూ చేసి, త్వరలోనే ఇల్లు నిర్మించి ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. అప్పటివరకు బాధితులకు ఏ అవసరమైన అందుబాటులో ఉంటామని ఉప సర్పంచ్ తోట రామకృష్ణ మంత్రికి తెలియచేసారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు తిగిరిపల్లి వెంకట్రావు, తోట రామకృష్ణ, వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది, వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు..
Tags thallapudi
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …