Breaking News

రామినేని విశిష్ట పురస్కారాలు…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి 1999 నుంచి డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ ‘పురస్కారాలు’ అందిస్తున్నామని, దానిలో భాగంగా ఈ ఏడాది ఐదుగురు డాక్టర్‌ కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా, బ్రహ్మానందం, ప్రొఫెసర్‌ దుర్గాపద్మజ, ఎస్‌.వి.రామారావులకు డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ ‘పురస్కారాలు’ 2021 లభించినట్లు డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ ఛైర్మన్‌ రామినేని ధర్మప్రచారక్‌ తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఫౌండేషన్‌ కన్వీనర్‌, గుంటూరు జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ గత ఏడాది ఫౌండేషన్‌ తరఫున పురస్కారాలను ప్రకటించినా కరోనా కారణంగా వాటిని అందజేయలేకపోయామన్నారు. ఈ ఏడాది నిర్వహించే పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో వాటిని కలిపి అందజేస్తామన్నారు. నాబార్డు ఛైర్మన్‌ డాక్టర్‌ జీఆర్‌ చింతలకు విశిష్ట పురస్కారం, సినీ నటుడు సోనూసూద్‌కు ప్రత్యేక పురస్కారం, టీవీ యాంకర్‌ సుమ కనకాల, హీలింగ్‌ హాస్థ హెర్బల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.మస్తాన్‌ యాదవ్‌, షిర్డీలోని ద్వారకామాయి సేవా ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ బి.శ్రీనివాస్‌కు విశేష పురస్కారాలను గతేడాది ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అయ్యన్న చౌదరి స్ఫూర్తితో ఆయన కుమారులు ధర్మ ప్రచారక్‌, సత్యవాది, బ్రహ్మానంద, వేదాచార్య, హరిశ్చంద్ర, కుమార్తె శారద తమ సొంత నిధులతో స్థాపించిన ఈ ఫౌండేషన్‌ ద్వారా గుంటూరులో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన 500 మంది విద్యార్దులకు రూ.5 వేల చొప్పున ఉపకార వేతనాలను అందజేయనున్నట్లు తెలిపారు. విద్యార్దులను తీర్చిదిద్దిన ప్రధానోపాధ్యాయులకు రామినేని ఫౌండేషన్‌ గురు పురస్కారాలను ప్రధానం చేస్తామన్నారు. అలాగే 32 విభిన్నరంగాలకు చెందిన విశిష్ట ప్రతిభ చూపిన వ్యక్తులకు కూడా ఏటా అవార్డులు ప్రధానం చేస్తోందన్నారు. ఈ ఏడాది ఐదుగురు డాక్టర్‌ కృష్ణా ఎల్లా, శ్రీమతి సుచిత్రా ఎల్లా, బ్రహ్మానందం, ప్రొఫెసర్‌ దుర్గాపద్మజ, ఎస్‌.వి.రామారావులకు డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ ‘పురస్కారాలు 2021’ లభించినట్లు తెలిపారు. పురస్కారాలను అందించే తేదీ, వేదిక తదితర వివరాలను త్వరలో తెలియజేస్తామని నాగభూషణం చెప్పారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వివరాలు త్వరలో ప్రకటిస్తామని పాతూరి నాగభూషణం చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *