-తెలుగుదనంతో పాటు, రాష్ట్ర ఔన్నత్యం ఉట్టి పడేలా పోలవరం.
-జపాన్ నిప్పాన్ కోయి సంస్దతో డిజైన్స్ పై చర్చలు.
-జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్దేశిని, రాష్ట్ర ప్రజల జీవనాడి ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుని టూరిజం హబ్ గా మార్చబోతున్నట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పోలవరం బ్యూటిఫికేషన్ కు సంబందించి బుధవారం ఆయన అధికారులు, ఆర్కిటెక్ట్ లు , ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. తెలుగుదనంతో పాటు, రాష్ట్ర ఔన్నత్యం ఉట్టి పడేలా పోలవరం స్పిల్వే ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారన్నారు.
పోలవరం ప్రాజెక్టు పరిధిలో 10 వేల ఏకరాలను లైడార్ సర్వే ద్వారా గుర్తించి , పోలవరం ను టూరిజం హబ్‌గా డిజైన్ చేయబోతున్నామన్నారు. పోలవరం రైట్, లెఫ్ట్ బ్యాంక్ ను కలుపుతూ,బ్రిడ్జిల నిర్మాణంకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామని వివరించారు. ఏలూరు, కొవ్వూరు, రాజమండ్రి లను జాతీయ రహదారులతో పోలవరం ప్రాజెక్టుని అనుసంధానించేలా ప్రతిపాదనను పరిశీలిస్తున్నాన్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు నుండి పాపికొండలు మీదుగా భద్రాచలం వరకు టూరిజం హబ్ గా మార్చేలా జపాన్ కు చెందిన నిప్పాన్ కోయి ఏజెన్సీ ఇచ్చిన పలు డిజైన్స్ పరిశీలించారు.
పోలవరం ప్రాజెక్టు ఏరియాలో గోదావరి ఔన్నత్యాన్ని, పరివాహక ప్రాంత సంస్కృతి చాటేలా మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, టెంపుల్ టూరిజం, రిసార్ట్స్, హట్స్, ఎమ్యూజ్మెంట్ పార్క్ లు అభివృద్ది చేసేలా ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్నామన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలన చేసి డిజైన్స్ ఫైనల్ చేస్తారని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్ సి నరసింహమూర్తి, జపాన్ కు చెందిన నిప్పాన్ కోయి ఏజెన్సీ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News