-గడువులోగా చేరని విద్యార్థుల సీట్లు రద్దు
-కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సమన్వయ అధికారి ఎ. మురళీకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురుకుల విద్యాలయాలలో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులు, విద్యార్థినులు తమకు కేటాయించబడిన పాఠశాలల్లో ఈ నెల 3వ తేదీ (శుక్రవారం ) లోగా తప్పనిసరిగా చేరాలని కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సమన్వయ అధికారి ఎ.మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
నిర్దేశిత గడువులోగా సంబంధిత పాఠశాలల్లో చేరని పక్షంలో, వారికి కేటాయించిన సీట్లు రద్దు చేయబడతాయని ఆయన స్పష్టం చేశారు. ఖాళీ అయిన సీట్లను తదుపరి మెరిట్ జాబితాలో ఉన్న అర్హులైన అభ్యర్థులకు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు.
అందువల్ల ఎంపికైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి, గడువులోగా సంబంధిత గురుకుల పాఠశాలల్లో చేరి ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సమన్వయ అధికారి ఎ. మురళీకృష్ణ సూచించారు.
Prajavartha Online Telugu News