విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర రవాణా వ్యవస్థ అభివృద్ధికి ఎలక్ట్రిక్ వాహనాలు కీలకమని విజయవాడ ప్రాంతీయ రవాణా అధికారి ఎస్. వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రోజురోజుకు కాలుష్యం పెరుగుతోందని, కాలుష్యం నుంచి మనల్ని రక్షించుకోవాలి, భవిష్యత్తు తరాలకు మంచి రవాణా వ్యవస్థను అందించాలంటే పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో పేరొందిన మోంట్రా ఎలక్ట్రిక్ సంస్థ తమ అధునాతన ఆధీకృత డీలర్ షోరూం శాస్త ఈ ఆటో ను విజయవాడలో ఏర్పాటు చేసింది. గుణదలలో ఏర్పాటు చేసిన ఈ నూతన షో రూమ్ ను విజయవాడ ప్రాంతీయ రవాణా అధికారి ఎస్ వెంకటేశ్వరరావు, మోంట్రా ఎలక్ట్రిక్ సేల్స్ రీజనల్ హెడ్ శ్రీధర్ భట్, ఏరియా సేల్స్ మేనేజర్ సైదుద్దిన్, సౌత్ రీజినల్ రిటైల్ ఫైనాన్స్ మేనేజర్ వికాష్, సౌత్ రీజినల్ కస్టమర్ కేర్ మనికన్నన్, ఏరియా కస్టమర్ కేర్ మేనేజర్ వెంకట్ మణికరణ్, శాస్త ఈ ఆటో డైరెక్టర్ సి. శ్రీ దత్త పార్ధసాయి రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మోంట్రా ఎలక్ట్రిక్ పాసెంజర్, గూడ్స్ ఆటోలను ఆవిష్కరించి, వాహనం తాళాలను కొనుగోలుదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీఓ ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రవాణా రంగంలో మోంట్రా ఎలక్ట్రిక్ ఒక నూతన అధ్యాయమని అన్నారు. ఆటో సెగ్మెంట్ లో ఎలెక్ట్రికల్ ఆటతో చాలా తక్కువ చూశామని, ఇంత పెద్ద సైజు ఆటో తయారు చేయడం, ప్రయాణికుల సౌకర్యం చూసుకోవడం శుభపరిణామం అన్నారు. ఒకసారి ఫుల్ ఛార్జి అయితే 150 నుంచి 180 కిలోమీటర్లు మైలేజి ఇస్తుందని, ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి ఆరు గంటల సమయం పడుతుందని కంపెనీ ప్రతినిధులు చెప్పారన్నారు. హరిత రవాణా ను ప్రోత్సహించడంలో భాగంగా ఇటువంటి వాహనాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. మోంట్రా ఎలక్ట్రిక్ ఏపీ సేల్స్ హెడ్ సైదుద్దిన్, సౌత్ సేల్స్ హెడ్ శ్రీధర్ మాట్లాడుతూ మురుగప్ప గ్రూప్ కు 125 సంవత్సరాల చరిత్ర ఉందని, ఈ గ్రూప్ కు చెందిన మోంట్రా ఎలక్ట్రిక్ ద్వారా అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలు అందిస్తున్నామని చెప్పారు. విజయవాడలో త్రి వీలర్ సెగ్మెంట్ లో శాస్త ఈ ఆటో పార్ధసాయి తమ డీలర్షిప్ ను తీసుకొని ప్రారంభించారని చెప్పారు. విజయవాడలో ఇది రెండో అవుట్ లెట్ అని చెప్పారు. అడ్వాన్సు ఫీచర్లతో సరికొత్త మోడల్ త్రి వీలర్ ను రూపొందించి, అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఎండి పార్ధసాయి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు.
Prajavartha Online Telugu News