గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను ఈ నెల 14వ తేదీలోపు వెనక్కి ఇచ్చి, డిజిటలైజేషన్ చేయకుంటే ఈ నెల 21న ప్రచురించే ముసాయిదా ఓటర్ల జాబితాలో వారి పేరు లేకపోయే అవకాశం ఉందని, దీంతో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఏఈఆర్ఓలతో ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియ ఎంతో ప్రాధాన్యత కల్గినదని, అందుకే అదనపు ఏఈఆర్ఓలను నియమించామని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ జూలై 14 నాటికి పూర్తీ చేసి, 21న డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ అవుతుందని, కనుక ప్రతి రోజు ముఖ్యమైనదేనన్నారు. బిఎల్ఓ రోజువారీ 100 ఫారాలు స్వీకరణ, డిజిటలైజేషన్ లక్ష్యంగా పని చేయాలన్నారు. అలాగే కలెక్షన్ అయిన ఫారాలను 2002 ఓటర్ లిస్ట్ తో మ్యాపింగ్ చేయాలన్నారు. ఏఈఆర్ఓలకు జిఎంసి నుండి నియమించిన సూపర్వైజరీ అధికారులు సమన్వయం చేసుకుంటారని, ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి తీసుకోవడంలో బిఎల్ఏల సహకారం తీసుకోవచ్చని పేర్కొన్నారు.
సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ జి.సాంబశివరావు, ఏఈఆర్ఓలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News