-రైల్వే అధికారులతో కలిసి ప్రతిపాదిత వంతెన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే సుజన చౌదరి
-దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వన్‌టౌన్–టూటౌన్ కనెక్టివిటీకి కీలక ముందడుగు
-పూర్తిగా రైల్వే నిధులతో ఆర్ ఓ బీ నిర్మాణానికి ఆమోదం
-రానున్న రెండేళ్లలో పూర్తిచేసేలా చర్యలు
-ఎం ఎల్ ఏ సుజన చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఎర్రకట్ట రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. ఎర్రకట్ట–రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం కాగా, శనివారం పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజన చౌదరి) రైల్వే అధికారులతో కలిసి ప్రతిపాదిత నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కేదారేశ్వరపేట ఫ్రూట్ మార్కెట్, ఎర్రకట్ట ప్రాంతాల్లో ప్రతిపాదిత రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి)రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ సిద్ధమైన నేపథ్యంలో రైల్వే అధికారులు ప్రాజెక్టు వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వన్‌టౌన్–టూటౌన్ మధ్య కనెక్టివిటీ సమస్య పరిష్కారానికి ఇది కీలకమన్నారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా నిరంతరం కృషి చేశామని తెలిపారు. రైల్వే శాఖ నుంచి ఆమోదం పొందేందుకు సుమారు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు నిరంతరంగా ఫాలోఅప్ చేసినట్లు చెప్పారు. ఎంపీ కేశినేని శివనాద్ ( చిన్ని) తో పాటు తాను కూడా పలుమార్లు రైల్వే అధికారులను కలిసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా రైల్వే శాఖ నిధులతోనే వంతెన నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన డీపీఆర్ తయారీకి కూడా రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. అన్ని అనుకూలంగా సాగితే వచ్చే రెండేళ్లలో వంతెన నిర్మాణం పూర్తయ్యే అవకాశముందని ఎమ్మెల్యే సుజన చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు.
వంతెన అందుబాటులోకి వస్తే వన్‌టౌన్–టూటౌన్ మధ్య రాకపోకలు సులభతరం కావడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. వ్యాపార కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయని, ప్రజలకు సమయం, ఇంధనం ఆదా అవుతుందని వివరించారు. ఎర్రకట్ట ప్రాంతంలో పెరుగుతున్న ట్రాఫిక్, పైప్‌లైన్ పనులు, వాహనాల రద్దీ కారణంగా ఈ వంతెన నిర్మాణం అత్యవసరమైందని, రెండు దశాబ్దాల క్రితమే నిర్మించాల్సిన ప్రాజెక్టు ఇప్పుడు కార్యరూపం దాల్చడం కూడా పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనాచౌదరి) స్పష్టం చేశారు.
రైల్వే అధికారులు ఎస్ ఎస్ సి వర్క్స్, గతి శక్తి సూరపనేని శ్రీనివాస్, ఎ డి ఎన్ లైన్ బెజవాడ టీ వెంకయ్య, నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు , మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, టీడీపీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతాఉల్లా, టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్ అవ్వారు బుల్లబ్బాయి,ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ కూటమి నేతలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News