Breaking News

భారత్ మండపంలో ఘనంగా కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ 5వ వార్షికోత్సవ వేడుకలు

-సహకార్ సే సమృద్ధి’ జాతీయ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం  రఘురామ్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
న్యూఢిల్లీలోని భారత్ మండపం, ప్రగతి మైదాన్ వేదికగా కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో “సహకార్ సే సమృద్ధి – 5 స్వర్ణిమ్ సంవత్సరాలు: విజయాలు, నవకల్పనలు, వికసిత్ భారత్ దిశగా అడుగులు” అనే అంశంపై జాతీయ స్థాయి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. కేంద్ర హోం వ్యవహారాలు మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై, సహకార రంగంలో గత ఐదేళ్లలో సాధించిన విజయాలను వివరించడంతో పాటు పలు జాతీయ స్థాయి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు (APCOB) చైర్మన్ గన్ని వీరాంజనేయులు, APCOB మేనేజింగ్ డైరెక్టర్ వెంకట రామకృష్ణ, రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (DCCBs) చైర్మన్లతో కలిసి మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద సహకార ధాన్య నిల్వ (Grain Storage) పథకం కింద మొత్తం 75,000 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో 135 ఆధునిక గోదాములను రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రారంభించారు. ఈ గోదాములు రైతులకు పంట నిల్వ, మార్కెటింగ్, విలువ ఆధారిత సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు దోహదపడనున్నాయి.

అదేవిధంగా సహకార రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ (NCD) 3.0, జియో-ట్యాగ్ మొబైల్ యాప్, NDDB మిల్క్ సప్లై మానిటరింగ్ డ్యాష్‌బోర్డ్, సహకార్ CBS, సహకార్ సహయోగి (కృత్రిమ మేధస్సు ఆధారిత వేదిక), భారతీయ బీజ్ సహకారి సమితి టిష్యూ కల్చర్ కేంద్రాలు వంటి పలు డిజిటల్, మౌలిక సదుపాయాల కార్యక్రమాలను కేంద్ర మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకార రంగానికి కొత్త దిశను చూపిందని అన్నారు. కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా దూరదృష్టితో చేపట్టిన సంస్కరణలు సహకార వ్యవస్థను మరింత పారదర్శకంగా, సాంకేతికంగా బలోపేతం చేయడంతో పాటు రైతు కేంద్రితంగా తీర్చిదిద్దుతున్నాయని కొనియాడారు.

దేశవ్యాప్తంగా PACS, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (DCCBs), రాష్ట్ర సహకార బ్యాంకులను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సహకార ధాన్య నిల్వ పథకం, డిజిటల్ సేవల విస్తరణ, పారదర్శక పాలన వంటి కార్యక్రమాలు రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చడంతో పాటు “సహకారం ద్వారా సమృద్ధి – వికసిత్ భారత్” లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తాయని నెట్టెం రఘురాం అన్నారు.

దేశవ్యాప్తంగా రాష్ట్ర సహకార బ్యాంకుల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ప్రతినిధులు, సహకార సంఘాల నాయకులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

“సహకారం ద్వారా సమృద్ధి – వికసిత్ భారత్” లక్ష్య సాధనలో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ చేపడుతున్న కార్యక్రమాలు దేశ సహకార రంగ అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశిస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *