-8న ఆలయ వార్షికోత్సవం
-ఆలయ అధీక్షకులు ఎం.మల్లికార్జున్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పున్నమ్మతోట లోని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 7 న కోయిల్ ఆళ్వార్ తిరుమంజసం 8 న వార్షికోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధీక్షకులు ఎం. మల్లికార్జున్ తెలిపారు. ఇందులో భాగంగా టిటిడి ఆగమ సలహాదారు పరాశరం భావనారాయణ చార్యులు కంకణ భట్టార్ వరాహ వెంకట శశి కిరణ్ మరియు ఇతర రుత్వికులు సమక్షం లో ఈ నెల 7 వ తేదీ మంగళవారం ఉదయం 7 గంటలకు ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారని శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారని తెలిపారు.అనంతరం భక్తులను స్వామివారి సర్వదర్శనానికి అనుమతి తెలిపారు.
జూలై 8న ఆలయ వార్షికోత్సవాన్ని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ వార్షికోత్సవం వేడుకలను వైభవంగా నిర్వహించెండుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో భాగంగా ఉదయం 7.20 నుండి 1.45 గంటల వరకు అష్టోత్తరశతకలశాభిషేకము, మహాశాంతి హోమము, వర్షవర్ధన హోమము, మహా పూర్ణాహుతి, మహా స్నపనము, మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఆలయ ఇన్స్పెక్టర్ లలితా రమాదేవి దాతలు స్థానిక భక్తుల సమక్షంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎం.మల్లికార్జున్ ప్రకటనలో తెలిపారు .
Prajavartha Online Telugu News