గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియకు జూలై 14 వరకే గడువు ఉన్నందున, ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని నింపి, బిఎల్ఓలకు ఇచ్చి సహకరించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియలో భాగంగా సోమవారం నాటికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొత్తం 2,52,062 ఓటర్లకు గాను 2,50,498 ఫారాలను (99.38 శాతం) పంపిణీ చేసి, అందులో 1,23,005 ఫారాలను డిజిటలైజ్ చేశామని తెలిపారు. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 2,78,555 ఓటర్లకు గాను 2,76,401 ఫారాలను (99.23 శాతం) పంపిణీ పూర్తి చేసి, వాటిలో 1,23,445 ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేశామని వివరించారు.
Prajavartha Online Telugu News